అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: తల్లి, కొడుకు అక్కడిక్కడే దుర్మరణం
సెయింట్ లూయిస్ వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో.. శెట్టిపల్లి సుష్మ(32)తో పాటు ఆమె కుమారుడు మహీధర్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు.
సెయింట్ లూయిస్: శెట్టిపల్లి సుష్మ(32) అనే భారత మహిళ అమెరికాలో దుర్మరణం పాలైంది. సెయింట్ లూయిస్ వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో.. ఆమెతో పాటు ఆమె కుమారుడు మహీధర్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడ్డ ఆమె భర్త శెట్టిపల్లి రత్నాకర్ కొన ఊపిరితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
శెట్టిపల్లి సుష్మ ప్రయాణిస్తున్న కారు.. ఎదురుగా వచ్చిన మరో వాహనం.. రెండు ఎదురెదురుగా ఢీ కొనడంతో.. ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి సెయింట్ లూయిస్ మీదుగా ప్లానోకు వెళ్తుండగా.. తప్పుడు రూట్ లో వచ్చిన మరో వాహనం వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఢీకొట్టిన వాహనం డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో మరణించడం గమనార్హం.

ప్రమాదం జరిగిన సమయంలో.. మొత్తం ఏడుగురు ప్రయాణిస్తుండగా.. సుష్మ కార్ డ్రైవింగ్ చేసినట్టుగా తెలిసింది. సుష్మతో పాటు ఆమె కుమారుడు మహీధర్ ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా సెయింట్ లూయిస్ లోని మెర్సి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications