పైకప్పు కూలి ఒకే కుటుంబంలో ఐదుగురు బలి

పేషావర్: ఇంటి పై కప్పు కుప్పకూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించిన దారుణ సంఘటన పాకిస్థాన్ లో జరిగింది. మరణించిన వారిలో పిల్లలతో పాటు మహిళ ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.

పాకిస్థాన్ లోని కరాక్ జిల్లాలో మహమ్మద్ ఖలీద్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతను శుక్రవారం పని మీద బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఖలీద్ భార్య షాహిదా (32), మర్యామ్ (12), ముకాద్దాన్ (8), ఆలీహా (6), ఇంకో చిన్నారి ఇంటిలో ఉన్నారు.

 Five of a family killed in roof collapse in Pakistan

తరువాత ఇంటి పై కప్పు ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగించారు. అప్పటికే శిథిలాల కింద ముకాద్దాన్, ఆలీహా, మర్యామ్ మరణించారు.

ఆసుపత్రిలో చికిత్స పోందుతూ ఖలీద్ భార్య షాహిదా, ఇంకో చిన్నారి మరణించారని పోలీసు అధికారులు చెప్పారు. ఖలీద్ చాలా కాలం క్రిం ఇల్లు నిర్మించారని, కొద్ది రోజులుగా పడుతున్న భారీ వర్షాల కారణంగా ఇంటి పై కప్పు కూలిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+