ఐక్యరాజ్యసమితి అధికారుల కిడ్నాప్.. ఉగ్రవాదుల పనిగా తేల్చిన యెమెన్
ఐక్యరాజ్యసమితి అదికారుల కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతుంది. అంతర్యుద్దంతో అట్టుడుకుతున్న దక్షిణ యెమెన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మిషన్‌లో భాగంగా ఐక్యరాజ్యసమితికి చెందిన ఐదుగురు సిబ్బంది యెమెన్‌లో పనిచేస్తున్నారు. ఈక్రమంలో పనిముగించుకుని తాము నివసిస్తున్న ప్రాంతాలకు తిరిగివస్తుండగా అల్‌ఖైదా ఉగ్రవాదులు అపహరించారు. ఈ విషయాన్ని యెమెన్ అధికారులు వెల్లడించారు.
ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన వారిలో నలుగురు యెమెన్ దేశస్థులుగా కాగా, ఒకరు విదేశీయుడు. ఐక్యరాజ్యసమితి సిబ్బందిని శుక్రవారం సాయంత్రం ఎత్తుకెళ్లి, గుర్తుతెలియని ప్రదేశానికి ఉగ్రమూకలు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. అటు ఈ కిడ్నాప్ వ్యవహారంపై తమకు సమాచారం అందినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. వారిని విడిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు యూఎస్ అధికార ప్రతినిధి స్టెఫనీ డుజారిక్ వెల్లడించారు.

అయితే యూఎన్ అధికారులను విచిడిపెట్టేందుకు ఉగ్రవాదులు కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. కొంత డబ్బుతో పాటు యెమెన్‌లో బంధీలుగా ఉన్న తమ వారిని విడిచిపెట్టాలని ఉగ్రవాదులు డిమాండ్ చేస్తున్నారు. యూఎన్ సిబ్బందిని విడిపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో సాయధ గిరిజనులు, అల్ ఖైదాతో సంబంధమున్నఉగ్రవాదులు. వీరు డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. బందీలుగా ఉన్న తమవారిని విడిపించుకునేందుకు అపహణలకు పాల్పడుతుంటారు. ఇలాంటి కిడ్నాప్‌లు యెమెన్‌లో సర్వసాధారణమైయ్యాయి. ఈ కుట్రలలో భాగంగానే ఉగ్రవాదులు యూఎన్ అధికారులను కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications