వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో మరోసారి కరోనా కలవరం - పెరుగుతున్న కేసులు : థర్డ్ వేవ్ సంకేతాలా - విమానాలు..స్కూళ్లు బంద్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

కరోనా పుట్టినిల్లు చైనాలో మరోసారి కలవరం మొదలైంది. చైనాలో మొదలైన కరోనా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు విస్తరించింది. లక్షలాది మందిని బలి తీసుకుంది. ఇతర దేశాల్లో ఆందోళన కర పరిస్థితికి చేరే సమయానికి చైనాలో తగ్గుముఖం పట్టింది. అయితే, ఇప్పుడు చైనాలో మరోసారి కరోనా కేసుల కలరవం ఆ దేశానికే కాదు..ప్రపంచ దేశాలకు అలర్ట్ గా మారుతోంది. తాజాగా చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కట్టడి చర్యల్లో భాగంగా అక్కడి ప్రభుత్వం అనేక నిర్ణయాలను ప్రకటించింది.

విమానాలు రద్దు..స్కూళ్ల మూసివేత

విమానాలు రద్దు..స్కూళ్ల మూసివేత

వందలాది విమాన సర్వీసులను రద్దు చేసింది, స్కూళ్లను మూసివేసింది. ఇదే సమయంలో కరోనా నిర్ధారణ పరీక్షలను పెద్ద సంఖ్యలు పెంచింది. కోవిడ్‌ కేసులు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆంక్షలు విధించింది. చాలా మంది పర్యాటకులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. వీరంతా షాంఘై నుంచి మొదలై గ్జియాన్‌, గాన్సు ప్రావిన్స్‌, ఇన్నర్‌ మంగోలియాలో పర్యటించారు. ఈ క్రమంలో రాజధాని బీజింగ్‌ సహా ఐదు ప్రావిన్స్‌ల్లో పెద్దఎత్తున ప్రజలతో కాంటాక్టు అయినట్లు భావించి చైనా చర్యలు చేపట్టింది.

తాజాగా పాజిటివ్ కేసులు నిర్ధారణ

తాజాగా పాజిటివ్ కేసులు నిర్ధారణ

అనుమానం ఉన్న ప్రాంతాల్లో విహార కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలను మూసివేసి స్థానిక ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. గ్జియాన్‌, లాన్‌జూల్లో 60 శాతం విమాన సర్వీసులను రద్దు చేసిన అధికారులు.. ఇన్నర్‌ మంగోలియాలోని ఎరెన్‌హట్‌కు రాకపోకలను నిలిపివేశారు. కాగా, డ్రాగన్‌ కంట్రీలో వరుసగా ఐదో రోజు కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి.. గురువారం 13 మందికి పాజిటివ్‌గా తేలగా.. అధిక కేసులు ఈశాన్య, వాయువ్య ప్రాంతాలకు చెందినగా అధికారులు చెబుతున్నారు. వాయువ్య చైనాలోని 40 లక్షల జనాభా ఉన్న లాన్‌జూ నగరంలో అవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ ప్రజలకు ఆదేశాలిచ్చారు.

చైనాలో వరుసగా అయిదో రోజు కేసుల గుర్తింపు

చైనాలో వరుసగా అయిదో రోజు కేసుల గుర్తింపు

గ్జియాన్‌, లాన్‌జూల్లో 60 శాతం విమాన సర్వీసుల ను రద్దు చేశారు. ఇన్నర్‌ మంగోలియాలోని ఎరెన్‌హట్‌కు రాకపోకలను నిలిపివేశారు. ఈ ప్రాంతంలో కరోనా ప్రభావం బొగ్గు దిగుమతులపై పడనుంది. కాగా, చైనాలో వరుసగా ఐదో రోజు కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం స్థానిక వ్యాప్తి ద్వారా 13 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. అయితే, ఇప్పుడు తిరిగి కేసులు నమోదు కావటంతో యూకే తో పాటుగా రష్యాలోనూ కేసుల సంఖ్య పెరగటం కలవర పాటుకు గురి చేస్తోంది. థర్డ్ వేవ్ ప్రమాదం లేనట్లేనని భావిస్తున్న సమయంలో ఈ కేసులు తిరిగి ప్రారంభం థర్ద్ వేవ్ కు సంకేతాలుగా భావించాలా అనే చర్చ మొదలైంది.

యూకే..రష్యాలోనూ పెరుగుతున్న కేసులు

యూకే..రష్యాలోనూ పెరుగుతున్న కేసులు

గత ఏడు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో బుధవారం కొవిడ్‌తో 223 మంది చనిపోయారు. దాదాపు 44 వేల కేసులు నమోదయ్యాయి. అదే విధంగా...మరోవైపు కొవిడ్‌ తీవ్రతతో రష్యా రాజధాని మాస్కోలో ఈ నెల 28 నుంచి ఆంక్షలను అమల్లోకి తేనున్నారు. నవంబరు 7 వరకు పాఠశాలలు, రెస్టారెంట్లు, ఆహారేతర కేంద్రాలను మూసివేయనున్నారు. గురువారం దేశంలో రికార్డు స్థాయిలో 36,339 కేసులు నమోదయ్యాయి. 1,036 మంది ప్రాణాలు కోల్పోయారు.

Recommended Video

China కి మూడింది, బోర్డర్‌ వద్ద Indian Army యుద్ధ సన్నాహకాలు! || Oneindia Telugu
థర్డ్ వేవ్ సంకేతాలుగా చర్చ

థర్డ్ వేవ్ సంకేతాలుగా చర్చ

ప్రజలు గుమిగూడకుండా చూడాలని మిగతా ప్రావిన్సు లకు సూచించారు. రష్యాలోని 85 రీజియన్లకు గాను అత్యధికచోట్ల సామూహిక కార్యక్రమాలపై ఆంక్షలున్నాయి. చైనా..రష్యా..యూకేల్లో నమోదువుతున్న కేసులతో ఇతర ప్రపంచ దేశాలు అలర్ట్ అవుతున్నాయి. ప్రధానంగా చైనాలో విస్తరిస్తున్న వేరియంట్ల మీద ప్రపంచ దేశాలు ఫోకస్ చేసాయి. అక్కడ నమోదువుతున్న కేసులు... గుర్తిస్తున్న వేరియంట్ల పైన ఆరా తీస్తున్నాయి. దీంతో..మరోసారి అప్రమత్తత మొదలైంది.

English summary
China cancelled hundreds of flights, closed schools and ramped up mass testing on Thursday to try and stamp out a new Covid-19 outbreak linked to a group of tourists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X