ఇక సెకనులో కరోనా పరీక్ష ఫలితం.. ఫ్లోరిడా వర్సిటీ పరిశోధకుల కొత్త టెక్నాలజీ...
యావత్ ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. ఆ పేరు చెబితేనే భయపడాల్సిన పరిస్థిత వస్తోంది. ఇక పరీక్షను యాంటిజెన్, ఆర్టీ పీసీఆర్, స్కాన్ చేస్తున్నారు. చాలా మట్టుకు యాంటిజెన్ పరీక్ష చేసి కరోనా వైరస్ నిర్ధారిస్తున్నారు. అయితే యాంటిజెన్ రావడానికి కనీసం 3 నిమిషాల వరకు పడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రి కేంద్రంలో.. లేదంటే ఇంటి వద్ద కూడా టెస్ట్ చేస్తున్నారు. దీంతో ఓకే.. కానీ మరింత మెరుగ్గా రిజల్స్ కోసం పరిశోధకులు రీసెర్చ్ చేస్తున్నారు. దీనిలో ప్లోరిడా వర్సిటీ పరిశోధకులు ముందడుగు వేశారు.
ప్రస్తుతం కరోనా టెస్టులు చేస్తే ఫలితం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒక్క సెకనులో కరోనా ఉందో, లేదో చెప్పేసే సరికొత్త పరీక్ష విధానానికి అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయం పరిశోధకులు రూపకల్పన చేశారు. అత్యంత వేగంగా కరోనా ఫలితం తెలిపే సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. కొత్త విధానంలో బయో సెన్సర్ స్ట్రిప్ ద్వారా కరోనా పరీక్షలు చేస్తారు.

కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి లాలాజలం ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. బయో సెన్సర్ స్ట్రిప్ గ్లూకోజ్ టెస్ట్ స్ట్రిప్ ను పోలి ఉంటుందని ఫ్లోరిడా వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. తాము రూపొందించిన కొత్త విధానంతో కరోనా పరీక్ష సమయం, ఖర్చు గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. పరీక్ష కచ్చితత్వంతో కూడి ఉంటుంది. తక్కువ సమయంలో.. తక్కువ ఖర్చుతో కచ్చితత్వంతో పరీక్ష రావడం అంటే మంచిదే.
ఇప్పుడు భారత్‌లో సెకండ్ వేవ్ నడుస్తోంది. అక్టోబర్‌లో థర్డ్ వేవ్ అంటున్నారు. ఇదీ చిన్న పిల్లలపై ప్రభావం చూపించనుంది. మళ్లీ మార్చిలో ఫోర్త్ వేవ్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంటే కరోనాతో కలిసి సహజీవనం చేయాల్సిందే. మాస్క్ ధరిస్తూ.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి వచ్చింది.












Click it and Unblock the Notifications