Viral video: గగుర్పాటు కలిగించే ఫుటేజ్: యూఎస్ విమానం నుంచి జారిపడ్డ ఆప్ఘనిస్తానీయులు
కాబుల్: కరడుగట్టిన మత ఛాందసవాదులైన తాలిబన్ల పరిపాలనలో జీవించడం కంటే చావే నయమనుకునే పరిస్థితికి వచ్చినట్టు కనిపిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు. అందుకే జీవితాలను పణంగా పెట్టి మరీ.. సాహసాలకు పాల్పడుతున్నారు. ప్రాణాల మీదికి తెచ్చుకుంటోన్నారు. తాలిబన్ల పరిపాలన ఎంత భయానకంగా ఉంటుందో ఇదివరకే ఓ సారి చవి చూసిన అనుభవం ఉన్నందున ఏకంగా దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నాలు సాగిస్తోన్నారు. ఈ క్రమంలో ఊపిరి వదులుతున్నారు.
Recommended Video
ఈ ఉదయం వేలాదిమంది ఆప్ఘన్ ప్రజలు కాబుల్ విమానాశ్రయానికి చేరుకున్న విషయం తెలిసిందే. అత్యంత ప్రమాదకర స్థితుల్లో వారు విమానాలు ఎక్కడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారి దైన్య స్థితికి అద్దం పట్టాయి. అప్పటికే కాబుల్ ఎయిర్ పోర్టుకు చేరిన అమెరికా రాయబార కార్యాలయ అధికారులు, ఉద్యోగులను రక్షించే క్రమంలో ఆ దేశ సైనికులు స్థానికులపై కాల్పులు జరపాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పండిందంటే- దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కాల్పుల్లో అయిదుమంది మరణించారు.

కాగా- కాబుల్ ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ తీసుకోవడానికి రన్‌వేపైకి వచ్చిన అమెరికా సైన్యానికి చెందిన యూఎస్ సీ-17 ఎయిర్ క్రాఫ్ట్‌కు వందలాది మంది ఆప్ఘనిస్తానీయులు చుట్టూమూగడం.. దాని టైర్లు, డోర్లకు వేలాడుతూ ప్రయాణించడానికి ప్రయత్నించడం ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పట్టు కూడా చిక్కని ఎయిర్ క్రాఫ్ట్ డోర్ల వద్ద నిల్చోవడం, టైర్ల వద్ద కూర్చోవడం కనిపించింది. మరికొందరు ఆ ఎయిర్ క్రాఫ్ట్‌తో పాటు పరుగులు తీయడం కనిపించిందా వీడియోలో.
United States of America fled Afghanistan leaving behind innocent Afghans.
— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 16, 2021
These shocking visuals from Kabul today describe the US withdrawal from Afghanistan. Betrayal. Escape. Lack of empathy. No clarity. Failure. Chaos. pic.twitter.com/UCDMC7CffT
కాబుల్‌లో టేకాఫ్ తీసుకున్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ టైర్ల కొక్కేలకు తమను తము కట్టుకుని అమెరికా వెళ్లిపోవడానికి ప్రయత్నించారు ఇద్దరు ఆఫ్ఘనిస్తానీయులు. ఎయిర్ క్రాఫ్ట్‌తో పాటు వారూ గాల్లోకి లేచారు. తాలిబన్ల చెర నుంచి విముక్తి లభించిందనే వారు ఆ క్షణంలో ఊపిరి పీల్చుకుని ఉండొచ్చు. 40 నిమిషాల పాటు ప్రయాణం ఆ ఎయిర్ క్రాఫ్ట్‌తో ప్రయాణం కూడా సాగించారు.
మార్గమధ్యలో ఆఫ్ఘనిస్తాన్ పొరుగునే ఉన్న ఇరాన్ మీదుగా ప్రయాణం సాగిస్తోన్న సమయంలో దురదృష్టం వారిని వెంటాడింది. ఎయిర్ క్రాఫ్ట్ ప్రయాణిస్తోన్న వాయు వేగానికి వారు టైర్ల కొక్కేం వద్ద నిలవలేకపోయారు. జారి పడ్డారు.. ప్రాణాలు కోల్పోయారు. సుమారు యూఎస్ సీ17 ఎయిర్ క్రాఫ్ట్ సుమారు 20 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోందనే అంచనాలు ఉన్నాయి. విమానం నుంచి జారిపడిన దృశ్యాలతో కూడిన ఓ వీడియో క్లిప్‌ను టెహ్రాన్ టైమ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Shocking footage of a US C-17 taking off from Kabul Airport around 40 minutes ago and something falls off from the aircraft. Many eyewitnesses claim 2-3 people fell off the aircraft over roofs of buildings in Kabul. Not officially confirmed. Shall update. pic.twitter.com/XFdctueRPU
— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 16, 2021












Click it and Unblock the Notifications