వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురు భార్యలు, ఉత్తర కొరియా ఇష్యూస్: ట్రంప్‌పై సెనేటర్ ఆగ్రహం

గత రెండు రోజులుగా వైట్ హౌస్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు రియాల్టీ షోను తలపిస్తున్నాయని రిపబ్లికన్ పార్టీ ఆరోపిస్తోంది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: గత రెండు రోజులుగా వైట్ హౌస్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు రియాల్టీ షోను తలపిస్తున్నాయని రిపబ్లికన్ పార్టీ ఆరోపిస్తోంది. అస్తవ్యస్త పాలనతో ట్రంప్ తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నారని ఆ పార్టీ సెనెటర్ ఒకరు బుధవారం మండిపడ్డారు.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో మాటల యుద్ధం, లాస్ వెగాస్ కాల్పుల ఘటన, ఫ్లోరిడా తుఫాను బాధితులను ఆదుకోవడంలో విఫలం అయ్యాడని మండిపడ్డారు.

For Trump, the Reality Show Has Never Ended

గత రెండు రోజులుగా వైట్ హౌస్‌లో పెద్ద రియాల్టీ షో జరుగుతోందని ట్రంప్ భార్యలను ఉద్దేశించి సదరు సెనేటర్ మండిపడ్డారు. ప్రథమ పౌరురాలు ఎవరు అన్న వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడంలేదన్నారు.

జాతీయ భద్రతా కార్యదర్శిగా పని చేస్తున్న టిల్లర్సన్ పైన ట్రంప్ వ్యవహరించిన తీరును సదరు సెనేటర్ తప్పుబట్టారు. టిల్లర్సన్‌ను ఐక్యూ టెస్టుకు సిద్ధంగా ఉండాలని ట్రంప్ ఆదేశించడాన్ని ఖండించారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారిని ఆయన ఎలా దూషిస్తారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో ట్రంప్ తనస్థాయిని దిగజార్చుకుంటారన్నారు.

ఉత్తర కొరియాతో చర్చలు జరుపుదామన్న జాతీయ భద్రతా కార్యదర్శి సూచనను తిరస్కరించడం ట్రంప్ అవివేకానికి నిదర్శనం అని సదరు సెనేటర్ చెప్పారు. ఇంకోవైపు రిపబ్లికన్ సెనేటర్ బాబ్ కొర్‌కర్ కూడా ట్రంప్ పైన మండిపడ్డారు. ట్రంప్‌ను మూర్ఖుడిగా అభివర్ణించారు.

English summary
Over the weekend, President Trump was accused by a Republican senator of running the White House like a “reality show.” In the 48 hours that followed, this is how the president rebutted the characterization.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X