అమ్మాయిల కిడ్నాప్‌లు, మతమార్పిళ్లు: పాక్‌లో భారీగా తగ్గిన హిందువులు, దయనీయం

పాకిస్థాన్ దేశంలో హిందువుల పరిస్థితి రోజు రోజుకు మరీ దయనీయంగా మారుతోంది. బలవంతంపు మతమార్పిడిలు జోరుగా సాగుతుండటంతో హిందువుల సంఖ్య భారీగా పడిపోయింది.

ఇస్లామాబాద్: పాకిస్థాన్ దేశంలో హిందువుల పరిస్థితి రోజు రోజుకు మరీ దయనీయంగా మారుతోంది. బలవంతంపు మతమార్పిడిలు జోరుగా సాగుతుండటంతో హిందువుల సంఖ్య భారీగా పడిపోయింది. 1947లో ఆ దేశంలో హిందువులు 23శాతం ఉండేవారు. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య 6శాతానికి పడిపోవడం ఆందోళన కలిగించే అంశమే.

కిడ్నాపులు, మతమార్పిళ్లు..

కిడ్నాపులు, మతమార్పిళ్లు..

బలవంతంపు మతమార్పిడులు, అణిచివేత వల్లే ఈ ఇస్లామిక్ దేశంలో మిగితా మతాలకు ఆదరణ కరువైనట్లు తెలుస్తోంది. మైనార్టీలుగా ఉన్న హిందూ అమ్మాయిలను బలవంతంగా ఎత్తుకెళ్లి.. ముస్లింలుగా మత మార్పడి చేసి, పెళ్లి చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి తాజాగా ద నేషన్ అనే పత్రిక ఓ వ్యాసంలో ఈ అంశాన్ని స్పష్టం చేసింది.

హిందువులే టార్గెట్..

హిందువులే టార్గెట్..

బలవంతపు మతమార్పిడుల వల్లే ఒకప్పుడు మెజారిటీగా ఉన్న హిందువులు ఇప్పుడు మైనార్టీలుగా మారినట్లు వెల్లడించింది. పాకిస్థాన్‌లోని సింధు ప్రావిన్సులో అత్యధిక శాతం హిందువులు ఉన్నారు. కానీ, ఇప్పుడు అక్కడ ఎక్కువ శాతం నేరాలు చోటు చేసుకుంటున్నాయి. మైనార్టీలైన హిందువులను టార్గెట్ చేస్తూ నేరాలు కొనసాగుతున్నాయి.

మతం మార్చేస్తున్నారు..

మతం మార్చేస్తున్నారు..

ముఖ్యంగా హిందూ అమ్మాయిలను ఇస్లాంలోకి మతమార్పిడి చేస్తున్నారు. తక్కువ కులానికి చెందిన హిందువులను మత మార్పిడులకు ప్రోత్సహిస్తూ, పెద్ద కులానికి చెందిన హిందూ అమ్మాయిలను ఎక్కువగా కిడ్నాప్ చేసి మతమార్పిడులకు పాల్పడుతున్నారు.

భారత్ వైపే వారి చూపు..

భారత్ వైపే వారి చూపు..

మూవ్‌మెంట్ ఫర్ సాలిడారిటీ అండ్ పీస్ ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం.. ప్రతి ఏడాది సుమారు వెయ్యి మంది ముస్లిమేతర అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చేస్తున్నారు. దీంతో పాకిస్థాన్‌లో ఉన్న హిందువులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి హిందువులు భారతదేశంలోకి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+