వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాలిబన్లకు పోటీగా ప్రవాస ప్రభుత్వం-స్విస్ నుంచి పాలన-అమ్రుల్లా సాలేహ్ నేతృత్వంలో

|
Google Oneindia TeluguNews

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లకు పరిస్ధితులు ఏమాత్రం సహకరించడం లేదు. ఇప్పటికే పాకిస్తాన్ మద్దతుతో పంజ్ షీర్ లోయను కూడా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. అంతర్జాతీయ గుర్తింపు మాత్రం దక్కేలా లేదు. అదే సమయంలో పాత ప్రత్యర్దులంతా ఏకమవుతున్నారు. ఆప్ఘన్ గడ్డపై నుంచి పాలన చేసే అవకాశం లేకపోవడంతో ప్రవాసం నుంచే ప్రభుత్వాన్ని నడపాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు స్విట్జర్లాండ్ ఎంబసీ నుంచి ప్రకటన చేశారు.

 ఆఫ్ఘన్ లో తాలిబన్ల పాలన

ఆఫ్ఘన్ లో తాలిబన్ల పాలన

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో ఏర్పడిన తాలిబన్ల ప్రభుత్వం పాలన మొదలుపెట్టేసింది. 33 మంది మంత్రులతో కొలువుదీరిన తాలిబన్ల సర్కార్ యథాలాపంగా పాలన కొనసాగిస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ మద్దతుతో ఓవైపు అంతర్జాతీయ మద్దతు కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు స్వదేశంలో ప్రత్యర్ధుల్ని అణచివేసే పనిలో బిజీగా ఉంది. దీంతో తాలిబన్ల ప్రభుత్వంపై ప్రత్యర్ధులు విదేశాల నుంచి కత్తులు నూరే పనిలో బిజీగా కనిపిస్తున్నారు. ఇప్పటికే తాలిబన్ల దెబ్బకు దేశం విడికి పారిపోయిన వారంతా ఇప్పుడు ఏకమవుతున్నారు.

పట్టు వీడని అమ్రుల్లా సాలేహ్

పట్టు వీడని అమ్రుల్లా సాలేహ్

తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కాకముంది అష్రప్ ఘనీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సాలేహ్.. ఆయన దేశం విడిచి పారిపోయాక తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. పంజ్ షీర్ లోయలో ప్రతిఘటన దళాలను కొంతకాలం వెనకుండి నడిపించారు కూడా. అయితే పరిస్ధితులు కలిసి రాక పాకిస్తాన్ ఎంట్రీ ఇచ్చింది. పంజ్ షీర్ లో పాకిస్తాన్ ఎంట్రీతో తాలిబన్లు ఘన విజయం అందుకున్నారు. అదే సమయంలో అమ్రుల్లా సాలేహ్ విదేశాలకు పారిపోయారు. ఇప్పుడు ఆయన మరో ఎంట్రీకి సిద్ధమవుతున్నారు.

 స్విట్జర్లాండ్ లో ఆప్ఘన్ ప్రవాస సర్కార్

స్విట్జర్లాండ్ లో ఆప్ఘన్ ప్రవాస సర్కార్


ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్లకు పోటీగా ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అమ్రుల్లా సాలేహ్ నేతృత్వంలోని మాజీ ఆప్ఘన్ అధికారులు ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ విషయాన్ని వారే స్వయంగా స్విట్జర్లాండ్ లోని ఆప్ఘన్ ఎంబసీ ద్వారా ప్రకటన కూడా చేయించారు. ఆప్ఘనిస్తాన్ లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే తమ మద్దతు ఉంటుందని స్విట్జర్లాండ్ ప్రభుత్వం ప్రకటన చేసింది. దీంతో ఆప్ఘన్ ప్రవాస ప్రభుత్వం ఇప్పుడు స్విట్జర్లాండ్ నుంచి పని చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అమ్రుల్లా సాలేహ్ ఆధ్వర్యంలోనే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నట్లు స్విస్ లోని ఆప్ఘన్ ఎంబసీ చేసిన ప్రకటన ద్వారా తెలిసింది. ఆప్ఘన్ లో ప్రజలు ఎన్నుకున్న అష్రఫ్ ఘనీ పారిపోయినందున ఆయన తొలి ఉపాధ్యక్షుడైన అమ్రుల్లా సాలేహ్ నే ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా గుర్తిస్తున్నట్లు ఈ ప్రకటన తెలిపింది.

Recommended Video

Afghanistan Economy In Crisis As Basic Food Prices Soar || DW Videos || Oneindia Telugu
పని మొదలుపెట్టేసిన అమ్రుల్లా సర్కార్

పని మొదలుపెట్టేసిన అమ్రుల్లా సర్కార్

ప్రవాసం నుంచి పనిచేయబోతున్న ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వం.. ఇవాళ పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. ఇందులో ప్రభుత్వానికి ఉండే మూడు అధికారాలైన కార్యనిర్వాహక, న్యాయ, చట్టపరమైన అధికారాలు త్వరలో పునరుద్ధరించబోతున్నట్లు తెలిపింది. అలాగే పంజ్ షీర్ లో అహ్మద్ మసౌద్ నేతృత్వంలో తాలిబన్లపై పోరాడుతున్న ప్రతిఘటన దళాలకు ఈ ప్రభుత్వం మద్దతు ఉంటుందని తెలిపింది. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆప్ఘన్ ఎంబసీలన్నీ యథావిధిగా పనిచేస్తాయని కూడా వెల్లడించింది. తాలిబన్ల సర్కార్ తాజాగా 57 క్రితం నాటి మొహమ్మద్ జహీర్ షా ఆమోదించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తామని ప్రకటించిన నేపథ్యంలో దీనికి కౌంటర్ గా ఈ ప్రవాస ప్రభుత్వ వెలువడినట్లు భావిస్తున్నారు.

English summary
amrullah saleh led former afghanistan officials on today announce new govt in exile for people of their country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X