మాలేలో భారీ పేలుడు: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్‌కు గాయాలు
మాలె: మాల్దీవుల్లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ నషీద్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు అధికారులు వివరాలను వెల్లడించారు.
మాల్దీవుల రాజధాని మాలో మొహమ్మద్ నషీద్(53) తన కారు ఎక్కుతుండగా ఈ పేలుడు ఘటన సంభవించిందని మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ(ఎండీపీ)కి చెందిన ఓ నేత వెల్లడించారు. కారుకు సమీపంలో పార్క్ చేసిన ఓ మోటారుసైకిల్‌లో తీవ్రమైన పదార్థాలను అమర్చిపేల్చివేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాద ఘటనలో నషీద్ తోపాటు పలువురికి గాయాలైటన్లు సమాచారం. అయితే, నషీద్‌కు గాయాలైనట్లు అధికారిక సమాచారం లేదు. గాయపడిన ఆయన బాడీగర్డ్స్ ను కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు శబ్ధం మాలే నగర వ్యాప్తంగా వినిపించిందని స్థానికులు చెబుతున్నారు.
ఏప్రిల్ 2019లో తన పార్టీ భారీ విజయం సాధించడంతో మొహమ్మద్ నషీద్ పార్లమెంటు స్పీకర్ అయ్యారు. దేశంలో రెండో పవర్‌ఫుల్ పదవి ఇదే కావడం గమనార్హం. 2008లో నషీద్ తొలిసారి మాల్దీవుల అధ్యక్ష పదవిని చేపట్టారు. 2012లో జరిగిన తిరుగుబాటులో అతను పదవిని కోల్పోయాడు. ఆ తర్వాత ఆయనపై క్రిమినల్ అభియోగాలు నమోదు కావడంతో 2018లో పోటీ చేయలేదు.
Deeply concerned at the attack on Speaker Mohamed Nasheed. Wish him a speedy recovery. Know that he will never be intimidated: EAM Dr S Jaishankar
— ANI (@ANI) May 6, 2021
(File photo) pic.twitter.com/9hiojXIdjC
Recommended Video
2018 ఎన్నికల్లో తమ పార్టీ గెలిచిన అనంతరం మళ్లీ రాజకీయాల్లోకి వచ్చిన నషీద్.. పార్లమెంటు స్పీకర్‌గా ఎన్నికయ్యారు. నషీద్‌పై జరిగిన దాడిని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షమీద్ తీవ్రంగా ఖండించారు. కాగా, మొహమ్మద్ నషీద్‌పై జరిగిన పేలుడు దాడిని భారత్ కూడా తీవ్రంగా ఖండించింది. నషీద్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications