• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

90 ఏళ్లలోను పారా జంపింగ్ చేసిన జార్జ్ హెచ్‌డబ్ల్యు బుష్, ఆయన హయాంలోనే ఇరాక్ యుద్ధం

|

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ 94 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. రాజనీతిజ్ఞుడిగా ప్రశంసలు అందుకున్నారు. యుద్ధ రంగం నుంచి శ్వేతసౌధం వరకు అవిశ్రాంత ప్రస్థానం సాగించడంతో పాటు తొమ్మిది పదులు దాటిన వయస్సులోను పారా జంపింగ్ చేశారు.

ఆయన శుక్రవారం హ్యూస్టన్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య బార్బరా బుష్‌ ఎనిమిది నెలల క్రితం మృతి చెందారు. సీనియర్‌ బుష్‌గా పేరొందిన ఆయన పార్కిన్సన్స్‌ వ్యాధితో బాధ పడుతూ కొంతకాలంగా చక్రాల కుర్చీకి పరిమితం అయ్యారు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో పలుమార్లు ఆసుపత్రికి వెళ్లారు. ఏప్రిల్‌లో భార్య బార్బరా మృతి అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది.

అమెరికా 41వ అధ్యక్షుడు జార్జ్ బుష్ సీనియర్ కన్నుమూత

 ఇటీవలే 94వ పుట్టిన రోజు

ఇటీవలే 94వ పుట్టిన రోజు

ఆ తర్వాత ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక ఈ ఏడాది జూన్ 12వ తేదీన 94వ పుట్టిన రోజును జరుపుకున్నారు. 94 ఏళ్లకు చేరిన మొదట మాజీ అధ్యక్షుడిగా ఆయన రికార్డు సృష్టించారు. అత్యున్నత వ్యక్తిత్వం కలిగిన తమ ప్రియమైన తండ్రి మృతి చెందారని చెప్పేందుకు విచారిస్తున్నానని ఆయన తనయుడు, అమెరికా 43వ అధ్యక్షుడు జార్జి బుష్ (సీనియర్) పేర్కొన్నారు. ఆయన మృతికి పలువురు దేశాధినేతలు సంతాపం తెలిపారు.

ఆయన హయాంలోనే ఇరాక్ యుద్ధం

ఆయన హయాంలోనే ఇరాక్ యుద్ధం

జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ 1989 నుంచి 1993 మధ్య అమెరికా 41వ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇరాక్ యుద్ధం ఆయన హయాంలో జరిగింది.అమెరికా ప్రయోజనాల కోసం ఎంత తీవ్ర చర్యలకైనా వెనకాడేవారు కాదు. రెండో ప్రపంచ యుద్ధంలో పైలట్ గా పనిచేసిన సీనియర్ బుష్ 1960లలో రిపబ్లిక్ పార్టీలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి ఉపాధ్యక్షులు అయ్యారు. జనాకర్షణ సాధించినా 1992 ఎన్నికల్లో బిల్ క్లింటన్ చేతిలో ఓడారు. పాలనలో ఆశ్రిపత పక్షపాతం చూపారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలున్నాయి.

పారా జంపింగ్‌తో 90వ బర్త్‌డే

పారా జంపింగ్‌తో 90వ బర్త్‌డే

జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ 2014లో తన 90వ ఏట కూడా పారా జంపింగ్‌తో జరుపుకున్నారు. తన సమ్మర్ హోమ్ కోస్టల్ మైన్‌లో ఈ పారా జింపింగ్ చేశారు. 2009లో అలాంటి జంపింగ్ చేశారు. ఆ తర్వాత కాళ్లు సహకరించలేదు. అనంతరం 2014లో చేశారు.

పారా జింపింగ్ ఇష్టం

పారా జింపింగ్ ఇష్టం

జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ తన 85వ ఏట ఆరువేల అడుగుల ఎత్తు నుంచి పారా జంపింగ్ చేశారు. అతనికి పారాచూట్ జంపింగ్ అంటే ఎంతో ఇష్టం. అతను చాలా ధైర్యవంతుడు అని అతనిని పలువురు ప్రశంసిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
Former President George H.W. Bush celebrated his 90th birthday back in 2014 by making a tandem parachute jump near his summer home in coastal Maine, fulfilling a goal he made in 2009 after a similar jump even though he could no longer use his legs.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more