ఐసిస్ ఉగ్రవాదులు జీవరసాయనాలతో దాడిచేయొచ్చు
పారిస్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జీవరసాయన ఆయుధాలతో దాడికి పాల్పడే అవకాశం కొట్టిపారేయలేమని గురువారం నాడు ఫ్రాన్స్ ప్రధానమంత్రి మాన్యుయల్ వాల్స్ అభిప్రాయపడ్డారు. ఫ్రాన్సులో జరిగిన భయంకర ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఫ్రెంచ్ పార్లమెంటు దిగువ సభ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉగ్రవాదుల నుంచి జీవరసాయన దాడులు జరిగే అవకాశం కొట్టిపారేయలేమని చెప్పారు. రసాయనాలు లేదా బ్యాక్టీరియాలతో ఉగ్రవాదులు ఫ్రాన్స్ పైన దాడికి జరపవచ్చునన్నారు. ఇలాంటి దాడుల నుంచి బయటపడేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
మనం ఏ విషయాన్ని తోసిపుచ్చలేమని చెప్పారు. దాడుల నేపథ్యంలో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని పొడిగించేందుకు పార్లమెంటు అనుమతిని కోరారు. భయంకరమైన దాడులకు ఊహించలేని అవకాశాలు ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారని మాన్యుయల్ వాల్స్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications