Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేషనల్ ఐకాన్ నుంచి 'నేరస్థురాలి'గా షేక్ హసీనా ప్రస్థానం!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ అంతర్జాతీయ క్రైమ్ ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది. బంగ్లాదేశ్‌లో గతేడాది జూన్‌లో తన వ్యతిరేకులపై సామూహిక హత్యలకు పాల్పడటం సహా పలు అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ ఇవాళ అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ సంచలన తీర్పు ప్రకటించింది. సుదీర్ఘకాలం పాటు దేశాన్ని పాలించిన ఈ మహిళా నాయకురాలి పూర్తి జీవిత కథ, ఆమె రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.

బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడి వారసురాలు
షేక్ హసీనా బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, మొదటి అధ్యక్షుడు అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె. ఆమె సెప్టెంబర్ 28, 1947 న తూర్పు పాకిస్తాన్‌లోని తుంగీపారాలో జన్మించారు. ఆమె 1968లో భౌతిక శాస్త్రవేత్త ఎం.ఏ. వాజేద్ మియాను వివాహం చేసుకున్నారు. వారికి సజీబ్ వాజేద్ జాయ్ (కుమారుడు), సైమా వాజేద్ (కుమార్తె) సంతానం. ఆగస్టు 1975లో బంగ్లాదేశ్‌లో సైనిక తిరుగుబాటు జరిగినప్పుడు ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్‌తో పాటు వారి కుటుంబ సభ్యులలో చాలా మందిని హత్య చేశారు. ఆ సమయంలో షేక్ హసీనాకు తన కుటుంబంతో సహా భారత్‌లో ఆశ్రయం లభించింది.

From National Icon to Convicted Criminal The Rise and Fall of Sheikh Hasina

ఆగస్టు 1975లో బంగ్లాదేశ్‌లో సైనిక తిరుగుబాటు జరిగినప్పుడు ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్‌తో పాటు వారి కుటుంబ సభ్యులలో చాలా మందిని హత్య చేశారు. ఆ సమయంలో షేక్ హసీనాకు తన కుటుంబంతో సహా భారత్‌లో ఆశ్రయం లభించింది. ఆమె కుమారుడు సజీబ్ వాజేద్ జాయ్ కూడా ఇక్కడే పెరిగి భారతీయ బోర్డింగ్ పాఠశాలల్లో విద్యను అభ్యసించారు.

సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం
1981లో షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చి, తన తండ్రి స్థాపించిన రాజకీయ పార్టీ అయిన అవామీ లీగ్ నాయకురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె తదనంతరం జనరల్ హుస్సేన్ ముహమ్మద్ ఇర్షాద్ సైనిక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ప్రజాస్వామ్యం కోసం వీధుల్లోకి వచ్చి నిరసనలు చేశారు. ఈ ప్రజా ఉద్యమం కారణంగా ఆమె త్వరలోనే దేశానికి 'నేషనల్ ఐకాన్' గా ఎదిగారు.

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం
షేక్ హసీనా నాలుగు దశాబ్దాలకు పైగా బంగ్లాదేశ్ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఆమె 1986-1990, 1991-1995 మధ్య కాలంలో విపక్ష నాయకురాలిగా పనిచేశారు. 1996లో ఆమె మొదటిసారిగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2009లో తిరిగి అధికారం చేపట్టారు. ఆ తర్వాత 2014, 2018లో కూడా ప్రధానమంత్రిగా ఎన్నికై, సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రపంచంలోనే మొదటి మహిళా నాయకురాలిగా రికార్డు సృష్టించారు.

ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళ
ఒకప్పుడు షేక్ హసీనా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా పరిగణించబడ్డారు. ఫోర్బ్స్ పత్రిక 2020లో విడుదల చేసిన ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమె 39వ స్థానంలో ఉన్నారు. (2018లో 26వ స్థానం, 2017లో 30వ స్థానం). టైమ్ మ్యాగజైన్ 2018లో ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో షేక్ హసీనాను చేర్చింది.

మానవత్వానికి వ్యతిరేకంగా నేరారోపణ
తాజా పరిణామం: 2024లో జరిగిన హింసాత్మక ప్రజా ఉద్యమం కారణంగా ఆమె దేశం విడిచి వెళ్లవలసి వచ్చింది. ఆ తర్వాత ఆమె భారత్‌లో ఆశ్రయం పొందారు. బంగ్లాదేశ్ క్రైమ్ ట్రిబ్యునల్ ఆమెపై మానవత్వానికి వ్యతిరేక తీవ్ర నేరాల ఆరోపణలు చేసింది. శాంతియుత ప్రదర్శనకారులపై బాంబులు వేయాలని ఆదేశించినట్లు ఆరోపించింది. అనేక మానవ హక్కుల సంస్థల నివేదికలలో షేక్ హసీనాపై మానవత్వానికి వ్యతిరేక నేరాల ఆరోపణలు ఉన్నట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. 2024 జులై- ఆగస్టు మధ్య సంభవించిన హింసాత్మక నిరసనల ప్రదర్శనలకు ఆమెను బాధ్యురాలిగా న్యాయస్థానం గుర్తించింది. అప్పట్లో ఈ అల్లర్లల్లో 1,400 మందికి పైగా మరణించారు. వారందరి మరణానికీ షేక్ హసీనా బాధ్యురాలని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే పదవీచ్యుతురాలైన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరణ శిక్ష పడింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ (ICT) కోర్టు తుది తీర్పు వెలువరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+