వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Japan New Prime Minister : జపాన్ కొత్త ప్రధానిగా ఫుమియో కిషిద...

|
Google Oneindia TeluguNews

జపాన్ కొత్త ప్రధానిగా ఫుమియో కిషిద బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం జపాన్‌లో అధికారంలో ఉన్న లిబరల్ డెమోక్రటిక్ పార్టీ(LDP) అధ్యక్షుడిగా బుధవారం(సెప్టెంబర్ 29) ఆయన్ను ఎన్నుకున్నారు. దీంతో కొత్త ప్రధానిగా కిషిద బాధ్యతలు చేపట్టడం లాంఛనమనేనని చెప్పాలి. ఎల్‌డీపీ అధ్యక్షుడు,ప్రస్తుత జపాన్ ప్రధాని యోహిషిడే సుగా రాజీనామాతో ఎల్‌డీపీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యమైంది.

ఎల్‌డీపీ అధ్యక్ష ఎన్నికలో ఫుమియో కిషిద తన ప్రత్యర్థి కొనోపై 257 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక కిషిద మాట్లాడుతూ..'ప్రజలు చెప్పింది వినడమే నా స్కిల్... జపాన్ ఉజ్వల భవిష్యత్తు కోసం అందరిని కలుపుకుని ముందుకెళ్లాలని నిశ్చయించుకున్నాను. ఎల్‌డీపీ అధ్యక్ష ఎన్నిక ముగిసింది.ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కలసికట్టుగా ముందుకెళ్దాం.' అని పేర్కొన్నారు.

fumio kishida is set to become japans new prime minister

64 ఏళ్ల కిషిద గతంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2012 నుంచి 2017 వరకు ఆ బాధ్యతల్లో ఉన్నారు. తన తండ్రి,తాతల నుంచి రాజకీయ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నారు.హిరోషిమా వాసి అయిన కిషిద... అణ్వాయుధాలను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. హిరోషిమా వాసిగా అక్కడ జరిగిన అణుదాడి ప్రభావం గురించి ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తి కావడంతో అణ్వాయుధాలను ఆయన వ్యతిరేకిస్తారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎల్‌డీపీని గెలిపించడం కిషిద ముందున్న అతిపెద్ద సవాల్. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా టోక్యో ఒలింపిక్స్ నిర్వహించడంతో ఎల్‌డీపీ ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది.కరోనా నేపథ్యంలో క్షీణించిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడినపెట్టడం ఆయన ముందున్న మరో సవాల్.

జపాన్‌కు సుదీర్ఘం కాలం పాటు షింజో అబే ప్రధానిగా ఉన్న సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో గతేడాది ఆగస్టులో ఆయన పదవి బాధ్యతల నుంచి తప్పుకున్నారు.దీంతో యోషిహిడే సుగా ఆ బాధ్యతలు చేపట్టారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో,వ్యాక్సినేషన్ విషయంలో సుగా విఫలమయ్యారనే విమర్శలున్నాయి.అన్నింటికి మించి ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఒలింపిక్స్ నిర్వహించారనే ఆగ్రహం ప్రజల్లో నెలకొంది. ఈ ఎఫెక్ట్‌తో సుగా పనితీరుకు సంబంధించిన రేటింగ్ 30శాతం మేర పడిపోయింది. దీంతో ఇక ఆ పదవిలో కొనసాగవద్దని సుగా నిర్ణయించుకున్నారు. ఆయన స్థానంలో ఫుమియో కిషిద జపాన్ నూతన ప్రధానిగా వచ్చే వారం బాధ్యతలు చేపట్టనున్నారు.

English summary
Fumio Kishida is set to take over as the new Prime Minister of Japan. He was elected president of the ruling Liberal Democratic Party (LDP) in Japan on Wednesday (September 29). It is safe to say that Kishida took over as the new Prime Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X