ఒకేసారి మోడీ, షింజో అబేలతో భేటీ కానున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 30, డిసెంబర్ 1న బ్యూనస్ ఏరిస్‌లో జరగనున్న జీ 20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షింజో అబేలతో ఏకకాలంలో భేటీ అవుతారని వైట్ హౌజ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలతో ట్రంప్ పలు అంశాలపై చర్చించనున్నట్లు వైట్ హౌజ్ తెలిపింది.
జీ-20 సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న 20 దేశాలకు చెందిన అగ్రనేతలు హాజరుకానున్నారు. అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తిగా మారనుంది. ఇదే సదస్సు సందర్భంగా జిన్‌పింగ్‌తో ట్రంప్ సమావేశమవుతారు. అంతేకాదు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా ట్రంప్ భేటీ అవుతారు. జీ 20 సమావేశానికి ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అర్జెంటీనా అధ్యక్షుడు మారిసియో మాక్రితో సమావేశం అవుతారని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జాన్ బోల్టన్ చెప్పారు.

ఆ తర్వాత దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌లతో భేటీ అవుతారని చెప్పారు. ఇదిలా ఉంటే ట్రంప్ షింజో అబేలతో సమావేశంలో మోడీ కూడా ఒకేసారి పాల్గొంటారని వైట్‌హౌజ్ వర్గాలు వెల్లడించాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో విందు సమావేశంలో ట్రంప్ భేటీ అవుతారని బోల్టన్ వెల్లడించారు.
-
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..!












Click it and Unblock the Notifications