వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యాకు వ్యతిరేకంగా నిలిచిన భారత్: పుతిన్‌కు మోడీ హితబోధ: జెలెన్‌స్కీకి ఫోన్: జీ7 దేశాలతో గళం

|
Google Oneindia TeluguNews

బెర్లిన్: జర్మనీ వేదికగా జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు కొనసాగుతోంది. ఆ దేశ దక్షిణ ప్రాంతంలోని బవారియన్ ఆల్ప్స్ రీజియన్‌లో గల ష్లాస్ ఎల్మావ్‌లో ఈ సమ్మిట్ ఏర్పాటైంది. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ ష్కాల్జ్ దీనికి అధ్యక్షత వహిస్తారు. ఉగ్రవాదం, ఆహార భద్రత, గ్రీన్ ఎనర్జీ, వాతావరణ మార్పులు, పర్యావరణం.. వంటి కీలక అంశాలు ఇందులో చర్చకు రానున్నాయి. అనంతరం జీ7 దేశాలు పలు తీర్మానాలను ఆమోదిస్తాయి.

జీ7 దేశాలతో..

జీ7 దేశాలతో..

ప్రత్యేకించి రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంపైనా ఆయా దేశాధినేతలు, ప్రధానమంత్రులు చర్చించారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్‌తో పాటు భారత్‌, అర్జెంటీనా, ఇండొనేషియా, సెనెగల్, దక్షిణాఫ్రికా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఇందులో పాల్గొన్నారు. సమ్మిట్ ప్రారంభంలోనే ఆయా దేశాలన్నీ ఉక్రెయిన్‌కు భారీగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి.

 యుద్ధాన్ని సమర్థించట్లే..

యుద్ధాన్ని సమర్థించట్లే..

జీ7 దేశాల కూటమి కలిసి ఉక్రెయిన్‌కు 29.5 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను కేటాయిస్తామని స్పష్టం చేశాయి. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఈ శిఖరాగ్ర సదస్సులో భారత్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై తన వైఖరిని స్పష్టం చేశారు. యుద్ధాన్ని తాము సమర్థించట్లేదని తేల్చి చెప్పారు. తక్షణమే రష్యా తన సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు.

జెలెన్‌స్కీకి ఫోన్‌కాల్..

జెలెన్‌స్కీకి ఫోన్‌కాల్..

శాంతియుత వాతావరణంలో చర్చలు, దౌత్యపరంగా ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని మోడీ అన్నారు. ఈ క్రమంలో ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీకి ఫోన్ చేశారు. ఉక్రెయిన్‌లో చోటు చేసుకుంటోన్న పరిణామాలు, యుద్ధం వల్ల సంభవిస్తోన్న నష్టం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశ ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

వివరాలు వెల్లడించిన విదేశాంగ శాఖ..

వివరాలు వెల్లడించిన విదేశాంగ శాఖ..

ఈ వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వట్రా వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీ7 సదస్సులో ప్రధాని మోడీ ప్రస్తావించిన అంశాల గురించి వివరించారు. ఈ రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న యుద్ధాన్ని నివారించడానికి యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు గట్టిగా ప్రయత్నించాలని మోడీ ఆయా దేశాల ప్రతినిధులకు విజ్ఞప్తి చేసినట్లు వినయ్ తెలిపారు.

ఆహార భద్రతకు ముప్పు

ఆహార భద్రతకు ముప్పు

యుద్ధం వల్ల ఆహార భద్రతకు ముప్పు ఏర్పడే పరిస్థితులు తలెత్తినట్లు ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి- పేద దేశాలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రకటించిందని, అప్పటి నుంచి వేర్వేరు అంతర్జాతీయ వేదికలపై భారత్.. తన వైఖరిని స్పష్టం చేస్తూనే వస్తోంది. ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలోనూ యుద్ధాన్ని వ్యతిరేకించింది. చర్చల పునరుద్ధరణకు ప్రాధాన్యతను ఇవ్వాలంటూ సూచించింది.

 బీజీగా మోడీ..

బీజీగా మోడీ..


జీ7 సమ్మిట్‌లో ప్రధాని మోడీ తీరిక లేని షెడ్యూల్‌ను గడిపారు. యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సుల వొన్ డెర్ లెయెన్, ఇండోనేషియా అధ్యక్షుడు జొకొ విడొడొ, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ ష్కాల్జ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంఫొసా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. భారత్‌లో పెట్టుబడులతో పాటు దౌత్య సంబంధాలపై మాట్లాడారు.

English summary
PM Narendra Modi made India's position clear including an immediate end to hostilities, dialogue and diplomacy to resolve the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X