వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: భార్యకు నిప్పంటించి హత్య చేసిన ‘గే’ భర్త

|
Google Oneindia TeluguNews

Gay NRI bank worker kills wife to hide sexuality
లండన్: వివాహమైన కొద్ది నెలలకే తన భార్యను కడతేర్చాడు ఓ ప్రవాస భారతీయుడు. తన లైంగిక సామర్థ్యానికి సంబంధించిన లోపాలు బయటపడతాయనే ఆందోళనకు గురైన నిందితుడు తన భార్యను చిత్ర హింసలకు గురి చేసి, చివరకు నిప్పుపెట్టి హత్య చేశాడు. నిందితుడు స్వలింగ సంపర్కుడని, తన గురించి భార్యకు తెలిసిపోతుందనే అనుమానంతోనే దారుణానికి పాల్పడ్డాడని అక్కడి పోలీసులు తెలిపారు.

పోలీసులక కథనం ప్రకరాం.. గే అయిన నిందితుడు జస్విర్ రామ్ గిండే ఓ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నాడు. అతడు 2013 మార్చిలో 24ఏళ్ల రాణి అనే యువతిని వివాహం చేసుకుని బ్రిటన్‌కు వచ్చాడు. బ్రిటన్‌లోని వెస్ట్ మిడ్లాండ్స్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా, గిండేకు 2008 నుంచే ఇతర పురుషులతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తన భార్య రాణిని చిత్ర హింసలకు గురి చేస్తూ.. గత సెప్టెంబర్ 12న పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. తన ఇంటి ఆవరణలోని మృతదేహాన్ని పారేసి చెత్తాచెదారంతో కప్పేశాడు.

ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ ప్రారంభించిన పోలీసులు అతని ఇంటి వద్ద కాలిపోయి పడివున్న బాధితురాలి మృతదేహాన్ని గుర్తించి గిండేను విచారించారు. అనంతరం నిందితుడు గిండే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గిండేనే హత్య చేశాడని నిర్ధారించిన పోలీసులు అతన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టారు.

న్యాయవాదుల వాదనలను విన్న కోర్టు గిండే తన భార్యను హత్య చేశాడని నిర్ధారించింది. అయితే తాను హత్య చేయలేదని, పోలీసుల అబద్ధాలు చెబుతున్నారని నిందితుడు గిండే ఆరోపించాడు. కాగా, పూర్తి విచారణ తర్వాత నిందితుడికి కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. తమ అల్లుడు స్వలింగ సంపర్కుడన్న విషయం తమకు తెలియదని, తెలిసి ఉంటే తమ కూతుర్ని అతనికిచ్చి వివాహం చేసేవారిమి కాదని బాధితురాలు రాణి తండ్రి వాపోయారు.

English summary
A Court in England has been informed about a gruesome murder of a newly married Indian bride by her gay husband who wanted to hide his sexuality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X