నేను ఇంకా అందంగానే ఉన్నానా ?.. ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తున్న "గాజా చిన్నారి"

తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నట్టు కనిపిస్తున్న ఓ చిన్నారి. అప్పటికే జుట్టు ఊడిపోయి, బక్కచిక్కిన శరీరంతో ఎముకలు అన్ని కనబడుతూ... పేగులు కూడా ముడుచుకుపోయాయేమో అనేలా కనిపిస్తున్న నేపథ్యంలో.. తనకు వైద్యం అందించేందుకు వచ్చిన ఓ వైద్యురాలిని "నేను ఇంకా అందంగానే ఉన్నానా?" అంటూ అడిగింది. పసి వయసుకు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితుల్లో అడిగినవి ఈ మాటలు. ఆ సందర్భాన్ని అర్ధం చేసుకుంటే.. కంట కన్నీరు తప్ప... నోట మాట రాని తరుణం అది. ఈ హృదయవిదారక పరిస్థితులు గాజాలో నెలకొన్నాయి.

తీవ్ర పోషకాహార లోపంతో ఉన్న జుట్టు ఓ చిన్నారి.. ఖాన్ యూనిస్‌లోని ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ వఫా అబు నిమెర్‌తో ఈ మాటలు చెప్పినట్టు తెలుస్తోంది. అలానే ఆ పాప "నా జుట్టు మళ్లీ పెరుగుతుందా?" అని అడిగినట్లు అంతర్జాతీయ సహాయ సంస్థ అయిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు ఆ వైద్యురాలు తెలిపింది. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని కన్నీరు పెట్టిస్తుంది.

gaza-starvation-crisis-palestinians-face-hunger-deaths

కారణం అదే..

హమాస్ అక్టోబర్ 7న దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగంపై సైనిక చర్యలు చేపట్టిందని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత గాజాలో ఆహారం, సహాయం కొరత ఏర్పడిందని సమాచారం. దీని కారణంగా 110 మందికి పైగా గాజా ప్రజలు ఆకలితో చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలేనని సమాచారం. ఇందువల్లే గాజాలో పరిస్థితులు రోజురోజుకూ మరింత దయనీయంగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా ఆకలి కేకలతో వాతావరణం హృదయవిదారకంగా మారింది. తిండి దొరక్క పిల్లలు బలహీనంగా కుప్పకూలిపోతున్నారు. పోషకాహార లోపం వల్ల వందలాది చిన్నారులు రోజూ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. సరిపడా ఆహారం, ఔషధాలు లేక వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. గత నాలుగు రోజులుగా ఆకలికి అనేక మంది అమాయక పిల్లలు బలవుతున్నారు.

ఉత్తర గాజాలో ఉన్న పేషెంట్స్‌ ఫ్రెండ్స్‌ ఆసుపత్రిలో ఎన్నడూలేని విధంగా చిన్నారుల చేరికలు ఉన్నాయి. నిత్యం 200 నుంచి 300 మంది చేరుతున్నారు. గడిచిన మూడు వారాల్లో 48 పోషకాహారలోపం సంబంధిత మరణాలు చోటుచేసుకున్నాయని, వారిలో 28 మంది పెద్దలు, 20 మంది చిన్నారులు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు ఐదేళ్ల లోపు 21 మంది చిన్నారులు ఆకలి కారణంగా ప్రాణాలు కోల్పోయారని, జులైలోనే 13 మంది చనిపోయినట్లు గుర్తించామని ఐరాస మానవతా సంస్థ ఓసీహెచ్‌ఏ తెలిపింది.

గాజాలో మూడింట ఒకవంతు ప్రజలు తినడానికి తిండిలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదికను ఉటంకిస్తూ, పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే 11 నెలల్లో ఐదేళ్లలోపు వయస్సు ఉన్న 71,000 మంది పిల్లలు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇదిలా ఉండగా, సహాయ కార్యక్రమాలను నిలిపివేశారనే ఆరోపణల తరువాత ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితిని పక్కనపెట్టి రెండు నెలల క్రితం తన సొంత సహాయ పథకాన్ని ప్రారంభించింది. అయితే పంపిణీ కేంద్రాల వద్ద ఇజ్రాయెల్ బలగాలు జరిపిన కాల్పుల్లో 1,000 మందికి పైగా గాజా ప్రజలు మరణించారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.

మానవతావాద సంస్థలు ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేయాలని, గాజాలోకి సహాయం అందించడానికి అనుమతించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని కోరాయి. అయితే ఇజ్రాయెల్ చర్యల వల్ల గాజా నివాసయోగ్యం కాకుండా పోయిందని యుద్ధ ప్రభావాలపై దృష్టి సారించిన యూకేకు చెందిన మనోరోగ వైద్యుడు డెరెక్ సమ్మర్‌ఫీల్డ్ అన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, మసీదులు వంటి సామాజిక మౌలిక సదుపాయాలను నాశనం చేయడం ద్వారా ఇజ్రాయెల్ సమాజాన్ని నిర్మూలించిందని ఆయన ఆరోపించారు.

హమాస్‌ను నిందించడమే కాకుండా తమ దళాలు అంతర్జాతీయ చట్టం ప్రకారమే నడుచుకుంటున్నాయని ఇజ్రాయెల్ వాదిస్తోంది. బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం తరపున ఒక ప్రతినిధి మాట్లాడుతూ "ఇజ్రాయెల్ వల్ల ఏమీ జరగలేదు. హమాస్ సృష్టించిన కొరత ఇది" అని పేర్కొన్నారు. చర్చలు విఫలమైన సమయంలో కూడా ఐక్యరాజ్యసమితి సహాయ నెట్‌వర్క్‌ను పునరుద్ధరించాలని హమాస్ డిమాండ్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+