అమెరికా జార్జిటౌన్ వర్సిటీలో హిందూ మహిళా పూజారి
వాషింగ్టన్: అమెరికాలోని ప్రతిష్టాత్మక జార్జిటౌన్ విశ్వవిద్యాలయం తొలిసారిగా ప్రతిమా ధర్మ్ అనే ఒక హిందూ పూజారిని నియమించింది. ప్రతిమా ధర్మ్ మహిళ. ఉన్నత విద్య కోసం కోసం ఏటా వచ్చే హిందూ విద్యార్థుల మతపరమైన కార్యక్రమాలను ఆమెను పర్యవేక్షిస్తారు.
అక్టోబర్ 1న ఆమె తన బాధ్యతలను స్వీకరించారు. 2001లో అమెరికా వెళ్లిన ప్రతిమా ధర్మ్ అక్కడి సైన్యంలో పలు హోదాలలో పని చేశారు. యూనివర్సిటీలోని ఇతర మత విభాగాలతోనూ ఆమె కలసి పని చేస్తారు.

గత కొంతకాలంగా యూనివర్సిటీలో చదువుకునేందుకు వస్తున్న హిందూ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రతిమా ధర్మ్‌ను నియమించారు. దీనిని విశ్వవిద్యాలయంలోని హిందూ విద్యార్థులు స్వాగతించారు. కాగా, జార్జిటౌన్ విశ్వవిద్యాలయం 1789లో స్థాపించారు. ప్రతిమా ధర్మ్ గతంలో ఇరాక్‌లోను పని చేశారు. ప్రతిమా ధర్మ్ స్వస్థలం ముంబై. ఆమె 2001 మార్చిలో అమెరికా వచ్చారు.












Click it and Unblock the Notifications