వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత ప్రయాణికులపై నిషేధాన్ని ఎత్తేసిన జర్మనీ: విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్

|
Google Oneindia TeluguNews

దుబాయ్: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన సంక్షోభ పరిస్థితులు సమసిపోయేంత వరకూ ఒక్క విమానాన్ని కూడా నడిపించలేదు. వాయు మార్గాలను మూసివేశాయి. జర్మనీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా వంటి దేశాలు భారత్‌కు విమాన సర్వీసులను నిలిపివేశాయి.

ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. దేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ తగ్గిపోతోండటంతో విమాన సర్వీసులను పునరుద్ధరించడానికి సిద్ధపడుతోన్నాయి. ఈ విషయంలో ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందడుగు వేసింది. భారత్‌తో తమ విమాన సర్వీసులను పునరుద్ధరించబోతోన్నట్లు ప్రకటించింది. తాజాగా అదే జాబితాలో జర్మనీ కూడా చేరింది. భారత్‌పై విధించిన ట్రావెల్ బ్యాన్‌ను ఎత్తేసింది. ప్రయాణ నిషేధాన్ని ఎత్తేయడం వల్ల ఇక భారత్‌కు విమానాలను నడిపించడం ఖాయం.

 Germany Lifts Ban On Travellers From India, UK, Portugal ask a negative test on arrival

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వ్యాప్తి చెందడానికి మునుపటి పరిస్థితులు ఏర్పడవచ్చు.భారత్ సహా బ్రిటన్, పోర్చుగల్‌‌, నేపాల్, రష్యా దేశాల పౌరులపై విధించిన ప్రయాణ నిషేధాన్ని ఎత్తేసినట్లు రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ ప్రకటించింది. ఆయా దేశాలకు చెందిన ప్రయాణికులు జర్మనీకి వెళ్లొచ్చు. కరోనా వైరస్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అక్కడి అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. దీనితోపాటు- ఆ దేశం అమలు చేస్తోన్న క్వారంటైన్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

Recommended Video

Dr. Lasya Sai Sindhu, ENT and neurologist, said that doctors work hard to save the lives of patients

తమ దేశానికి రాకపోకలు సాగించే ప్రయాణికుల్లో భారత్, బ్రిటన్‌ పౌరుల సంఖ్య అధికంగా ఉంటుందని, తాజాగా తీసుకున్న నిర్ణయం వారికి మేలు కలిగిస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి జెన్స్ స్పాహ్న్ తెలిపారు.ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుందనే నిబంధనను అమలు చేస్తోన్నట్లు చెప్పారు. తమ దేశంలోకి ప్రవేశించినప్పుడు కరోనా వైరస్ నెగెటివ్, వ్యాక్సిన్ వేసుకున్నట్లు సర్టిఫికెట్లను అందజేయాల్సి ఉంటుందని మంత్రి జెన్స్ స్పష్టం చేశారు.

English summary
Germany's health agency said on Monday it would lift a ban on most travellers from the UK, India and three other countries hit by the Delta variant of Covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X