దుస్తులు విప్పి: గర్ల్‌తో పారిపోయాడని సోదరిపై దారుణం
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయితో పారిపోయాడని, అతని సోదరిపై అమ్మాయి తరఫు బంధువులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సంచలనం రేపింది. పాకిస్తాన్‌లోని చినియోట్ జిల్లాలో సనావుల్లా అనే ఇరవై రెండేళ్ల యువకుడు మల్లాహ్ కులానికి చెందిన యువతిని ప్రేమించాడు.
వారి పెళ్ళికి ఇరువర్గాలు నిరాకరించాయి. దీంతో, వారిద్దరూ ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ పెట్టించారు సనావుల్లా ప్రియురాలి కుటుంబ సభ్యులు. జరిగిన నష్టానికి ప్రతిగా, సనావుల్లా సోదరి ప్రియురాలి సోదరుడు జాహిద్ అలీని పెళ్ళి చేసుకోవాలని తీర్మానించారు.

ఈ తీర్పు ఇలా ఉండగానే, జాహిద్ మిత్రుడొకరు సనావుల్లా సోదరిని కిడ్నాప్ చేసి నిఖా చేసుకున్నాడు. అదీ ఐదు రోజుల తర్వాత విడాకులు ఇచ్చేలా ఈ నిఖా జరిపించుకున్నాడు. అనంతరం ఆమెకు జాహిద్ అలీకి సోదరుడి వరసయ్యే నూర్ అహ్మద్‌తో పెళ్ళి చేశారు.
కొన్ని రోజుల తర్వాత ఆ యువతిపై జాహిద్ అలీ కుటుంబ సభ్యులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఆమె బట్టలు విప్పి ఓ చెట్టుకు కట్టేశారు. సనావుల్లా తీసుకెళ్ళిన తమ అమ్మాయిని తిరిగి తమ వద్దకు పంపితేనే ఆమెను వదిలేస్తామని హెచ్చరించారు. దీనిపై సనావుల్లా కుటుంబ సభ్యులు మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications