వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆన్ చేసిన వాషింగ్‌మెషిన్‌లో చిన్నారి: తీవ్ర గాయాలు

|
Google Oneindia TeluguNews

 Girl Trapped in Spinning Washing Machine at Laundromat
టెక్సాస్: అమెరికాలోని పసడేనాలోని ఓ షాపింగ్ మాల్‌లో ప్రమాదవశాత్తు వాషింగ్‌మెషిన్‌లో పడిన చిన్నారి(5).. ఆ మెషిన్‌ను స్టార్ట్ చేయడంతో తీవ్ర గాయాలపాలైంది. గమనించిన సిబ్బంది వెంటనే ఆపేసి ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. బాధిత బాలిక ఎవరూ చూడకముందు ప్రమాదవశాత్తు లేస్ వాష్‌ టేరియా లాండ్రోమాట్‌ షాపింగ్ మాల్‌లోని వాషింగ్ మెషిన్‌లో పడిపోయింది. ఓ కస్టమర్ దానిని పరిశీలించాలని అడగడంతో చిన్నారిని గమనించని సిబ్బంది మెషిన్ ఆన్ చేశారు. దీంతో మెషిన్‌లో ఉన్న చిన్నారి అరుపులు కేకలు వేసింది.

వెంటనే వాషింగ్ మిషన్ ఆపేసిన సిబ్బందిన ఆమెను బయటికి తీశారు. తీవ్రగాయాలపాలైన చిన్నారిని హుస్టన్ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం కొంత నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

అయితే ఆ చిన్నారి వాషింగ్ మెషిన్‌లోకి ఎలా వెళ్లిందనేది ఎవరికీ తెలియడం లేదు. ఆమె ఎవరితోపాటు అక్కడి వచ్చిందీ.. ఎలా వచ్చిందీ అనే విషయాలు పోలీసులు చెప్పడం లేదు. కాగా, మాల్ మేనేజర్ మాట్లాడుతూ.. ఓ మహిళ కస్టమర్ తమ వద్ద ఆ మెషిన్‌ను కొనుగోలు చేసి.. అది పని చేయడం లేదని, తిరిగి తన డబ్బు ఇవ్వాలని ఇక్కడికి తీసుకొచ్చిందని చెప్పాడు. దీంతో తాను ఆ మెషీన్‌ను పరిశీలించాలని తన సిబ్బందికి తెలిపినట్లు తెలిపాడు.

English summary
Police say a 5-year-old Texas girl has been hospitalized after she was trapped inside a running washing machine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X