Ebola: శవాల కోసం ఆసుపత్రిపై దాడి! రెండు నెలల ముందే వైరస్ లీక్..

ఆఫ్రికా దేశం కాంగోను అతలాకుతలం చేస్తున్న ఘోరమైన ఎబోలా మహమ్మారి, అంతర్జాతీయ సమాజానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒకవైపు వైరస్ ఉధృతి, మరోవైపు స్థానిక తిరుగుబాటుదారుల దాడులతో తూర్పు కాంగో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత దారుణమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించబడిన ఈ మహమ్మారిని అరికట్టేందుకు వైద్య బృందాలు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నా, క్షేత్రస్థాయిలో వారికి ఎదురవుతున్న సవాళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.

తాజాగా ఇటూరి ప్రావిన్స్‌లోని మోంగ్‌బ్వాలు పట్టణంలో ఎబోలా బాధితులకు సేవలందిస్తున్న ఒక చికిత్సా కేంద్రంపై ఆగ్రహంతో ఉన్న స్థానిక యువకులు దాడికి తెగబడ్డారు. మహమ్మారి బారిన పడి మరణించిన తమ బంధువుల మృతదేహాలను తమకు అప్పగించాలంటూ సాయుధులైన యువకులు అక్కడ కాల్పులకు దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. వైద్య సిబ్బంది ప్రాణరక్షణ కోసం రోగులను హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.

Global Health Emergency Trump Funding Cuts Cripple Ebola Testing Equipment In Conflict Ridden East Congo

గత వారం రోజుల్లోనే రెండు ఆరోగ్య కేంద్రాలు అగ్నికి ఆహుతి కావడం చూస్తే, అక్కడ వైద్యులపై స్థానికుల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు మృతదేహాలకు అధికారులే కఠిన నిబంధనలతో అంత్యక్రియలు నిర్వహిస్తుండటం, సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిచ్చే స్థానికులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ముందస్తు జాగ్రత్తగా అధికారులు 50 మందికి పైగా గుమిగూడటంపై నిషేధం విధించి, సైనిక పహారా మధ్య అంత్యక్రియలు జరిపిస్తున్నారు.

మళ్లీ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ.. కేంద్రం అత్యవసర ప్రయాణ హెచ్చరికలు!
మళ్లీ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ.. కేంద్రం అత్యవసర ప్రయాణ హెచ్చరికలు!

రెండు నెలల ఆలస్యం.. విపరీతంగా పెరిగిన కేసులు

ఇటూరి ప్రావిన్స్‌లోని బునియా నగరంలో మే 15న తొలి ఎబోలా కేసు అధికారికంగా నమోదైనప్పటికీ, అంతకంటే రెండు నెలల ముందే అక్కడ అంతర్గతంగా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అధికారుల ఈ నిర్లక్ష్యం కారణంగా అప్పటికే వైరస్ సమాజంలోకి తీవ్రంగా చొచ్చుకుపోయింది. తాజా లెక్కల ప్రకారం ఇటూరి ప్రావిన్స్‌లోనే 900కు పైగా అనుమానిత కేసులు వెలుగుచూశాయి. మరణాల సంఖ్యపై స్పష్టమైన అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, వివిధ ప్రాంతాల గణాంకాలను పరిశీలిస్తే మృతుల సంఖ్య 220 దాటినట్లు తెలుస్తోంది. కేవలం కాంగోలోనే కాకుండా పొరుగు దేశమైన ఉగాండాకు కూడా ఈ వ్యాధి పాకడం గమనార్హం.

తిరుగుబాటు దాడులు.. పారిపోతున్న వైద్యులు

ఏళ్ల తరబడి సాగుతున్న అంతర్గత యుద్ధాలు, మిలిటెంట్ గ్రూపుల దాడులు కాంగోను మరింత బలహీనపరిచాయి. ఐసిస్ (IS) తీవ్రవాద సంస్థతో సంబంధాలున్న అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ADF), అలాగే రువాండా మద్దతు గల M23 తిరుగుబాటుదారులు ఈ ప్రాంతాల్లో సమాంతర పాలన సాగిస్తూ పౌరులపై హింసాత్మక దాడులకు తెగబడుతున్నారు. ఈ ఘర్షణల భయంతో దాదాపు పది లక్షల మంది ప్రజలు ఇళ్లను వదిలి శరణార్థి శిబిరాలకు తరలివెళ్లారు. అభద్రతా భావం వల్ల వైద్యులు, నర్సులు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతుండటంతో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా అదుపుతప్పింది.

Ebola Virus: అమెరికాలోకి నో ఎంట్రీ! వంద మంది మృతి..
Ebola Virus: అమెరికాలోకి నో ఎంట్రీ! వంద మంది మృతి..

నిధుల కోత.. చేతులు ఎత్తేసిన వైద్య శాలలు

అమెరికాలో ట్రంప్ పరిపాలన పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగోకు అందే అంతర్జాతీయ సహాయ నిధులలో భారీగా కోత విధించారు. ఈ ఆర్థిక సంక్షోభం ఎబోలా కట్టడిపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు కనీస వైద్య పరికరాలు కూడా అందుబాటులో లేవు. ఆరోగ్య కార్యకర్తలను కాపాడే పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్‌లు, టెస్టింగ్ కిట్లు, బాడీ బ్యాగ్‌లు, శానిటైజర్లు కూడా లేవని స్థానిక వైద్య సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విద్యుత్ కొరత కారణంగా రోజుకు కేవలం 20 నుంచి 40 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించగలుగుతున్నారు.

వ్యాక్సిన్ లేని రకం.. గుబులు రేపుతున్న 'బందిబుగ్యో'

1976లో తొలిసారి ఎబోలా వెలుగుచూసిన తర్వాత కాంగోలో ఈ వైరస్ విజృంభించడం ఇది 17వ సారి. అయితే, ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న 'బందిబుగ్యో' (Bundibugyo) రకానికి మార్కెట్లో ఎలాంటి అధీకృత వ్యాక్సిన్ గానీ, ప్రత్యేక చికిత్స గానీ అందుబాటులో లేదు. దీనివల్ల మరణాల రేటు దాదాపు 40 శాతానికి చేరుకుందని అంచనా. ఒకవైపు వైద్య పరికరాల కొరత, మరోవైపు సాయుధ దాడుల నడుమ కాంగోలో సాగుతున్న ఈ వైరస్ పోరాటం యావత్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+