అదే జరిగితే ప్రపంచానికి పెనుముప్పే: తాజా అధ్యయంలో వెల్లడైన నిజాలు!

Subscribe to Oneindia Telugu

లండన్: భవిష్యత్తు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టంలో గణనీయమైన మార్పులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న మట్టం నుంచి మరో మూడు మీటర్ల వరకు సముద్ర మట్టం పెరగవచ్చునని తాజా పరిశోధనలో వెల్లడైంది.

యూకెలోని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన అంతర్జాతీయ పరిశోధన బృందం దీనిపై పరిశోధనలు చేపట్టింది. అంటార్కిటా ప్రస్తుతం కోల్పోతున్న ద్రవ్యరాశి, నూతన గణాంక పద్దతి ప్రకారం 2100సంవత్సరం నాటికి సముద్ర మట్టాలు మూడు మీటర్ల వరకు పెరిగే అవకాశముందని సౌతాంప్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సైబ్రేన్ తెలిపారు.

Global sea levels may rise by over three metres: study

ఇప్పటివరకు కేవలం అర మీటరు వరకు సముద్ర మట్టం పెరుగుతుందని పరిశోధకులు భావించగా.. అందుకు భిన్నంగా ఇప్పుడు మూడు మీటర్లు మేర పెరుగుతుందని తేలడం గమనార్హం.

ఇప్పటిలాగే సముద్ర మట్టం పెరిగిన తర్వాత కూడా కార్బన్ డై యాక్సైడ్ ఉద్గారాలు వెలువడితే.. ఆ నష్టాలను అంచనా వేయడం కష్టమని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు, దీనివల్ల కొన్ని శతాబ్దాల్లోనే లోతట్టు నదీ డెల్టాల్లో ఏర్పడ్డ మహానగరాలన్ని ముంపుకు గురవుతాయని వారు అంచనా వేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Global sea levels could rise by over three metres - half a metre more than previously thought - this century alone, according to a new study.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి