ప్రమోషన్: అల్ఫాబెట్ బోర్డ్ డైరెక్టర్‌గా సుందర్ పిచాయ్
వాషింగ్టన్: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సాధిస్తున్న ఫలితాలను సంస్థ గుర్తించింది. ఈ క్రమంలో సుందర్ పిచాయ్‌కి గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ డైరెక్టర్ల బోర్డులో చోటు కల్పించింది. సెర్చ్ ఇంజిన్ గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్ ఎంతో బాగా విధులు నిర్వర్తిస్తున్నారని ఆల్ఫాబెట్ సీఈఓ లారి పేజ్ కొనియాడారు.
పటిష్ట వృద్ధి, భాగస్వామ్యాలు, వినూత్న ఉత్పత్తులు అధికసంఖ్యలో ఆవిష్కరించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, ఆల్ఫాబెట్ బోర్డులో సుందర్ చేరడం మరింత ఉత్సుకత కలిగిస్తోందని ఆల్ఫాబెట్ సీఈఓ లారి పేజ్ పేర్కొన్నారు.

2015 అక్టోబరు నుంచీ గూగుల్‌కు నాయకత్వం వహిస్తున్నారు. 13 మంది డైరెక్టర్లున్న ఆల్ఫాబెట్ బోర్డులో సుందర్ పిచాయ్ నియామకం జులై 19 నుంచి అమల్లోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన పిచాయ్, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications