వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈడు మామూలోడు కాదెహె: గూగుల్ కోఫౌండర్ భార్యతో ఎలాన్ మస్క్ ఇల్లీగల్ ఎఫైర్: విడాకుల దాకా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన కేంద్రం స్పేస్ఎక్స్, ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌లోని మరో కోణం వెలుగులోకి వచ్చింది. మొన్నటికి మొన్న ఆయన తండ్రి ఎర్రాల్ మస్క్.. తన సవతి కుమార్తెతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇద్దరు పిల్లలను కూడా కన్నారు. ఇప్పుడు తాజాగా ఎలాన్ మస్క్ కూడా అదే రూట్‌లో ఉన్నారు. అక్రమ సంబంధాలను పెట్టుకోవడం రికార్డులు బద్దలు కొడుతున్నారు.

 గూగుల్ సహ వ్యవస్థాపకుడి భార్యతో..

గూగుల్ సహ వ్యవస్థాపకుడి భార్యతో..

ఇప్పుడు ఏకంగా టాప్ సెర్చింజిన్ గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గె బ్రిన్ కాపురంలో చిచ్చు పెట్టాడు. ఆయన భార్యతో ఎలాన్ మస్క్ అక్రమసంబంధాన్ని పెట్టుకున్నారు. ఏడాది కాలంగా వారిద్దరి మధ్య ఈ ఇల్లీగల్ రిలేషన్ కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. 2021లో డిసెంబర్‌లో మియామిలో నిర్వహించిన ఆర్ట్ బేస్ ఫెస్టివల్ సందర్భంగా వారిద్దరూ కలిసినట్లు అమెరికా మీడియా పేర్కొంది. తాజాగా ఈ ఎఫైర్ వెలుగులోకి వచ్చింది. అది కాస్తా విడాకుల దాకా వెళ్లింది.

విడాకుల దాకా..

విడాకుల దాకా..

తన భార్య నికోల్ షనహన్‌తో ఎలాన్ మస్క్ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోన్నాడనే ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే సెర్గె బ్రిన్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 2018లో సెర్గె బ్రిన్ వివాహం జరిగింది. నికోల్ షనహన్‌ను పెళ్లి చేసుకున్నాడు. 1998లో ఆయన ల్యారీ పేజ్‌తో కలిసి గూగుల్ సెర్చింజిన్‌ను నెలకొల్పాడు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు 2019 వరకూ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు.

టాప్ 10 జాబితాలో..

టాప్ 10 జాబితాలో..

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆస్తుల విలువ 242 బిలియన్ డాలర్లు. సెర్గె బ్రిన్ కూడా మామూలోడు కాదు. ఈ జాబితాలో అతనిది ఎనిమిదో స్థానం. సెర్గెబ్రిన్ ఆస్తుల విలువ 94.6 బిలియన్ డాలర్లు. నిజానికి ఎలాన్ మస్క్-సెర్గె బ్రిన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. వారిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. సుదీర్ఘకాలంగా బలమైన వ్యాపార సంబంధాలు సైతం కొనసాగిస్తూ వస్తోన్నారు.

ఆర్థికంగా ఆదుకున్న సెర్గె..

ఆర్థికంగా ఆదుకున్న సెర్గె..

2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థికమాంద్యం పరిస్థితుల్లో టెస్లా, స్పేస్ఎక్స్‌ కుదేల్ కాగా.. సెర్గె బ్రిన్ భారీగా పెట్టుబడులు పెట్టి ఆదుకున్నారు కూడా. అలాంటి స్నేహితుడి భార్యతో ఎలాన్ మస్క్ అక్రమ సంబంధం పెట్టుకోవడం.. అది కాస్తా విడాకుల దాకా వెళ్లడం కార్పొరేట్ సెగ్మెంట్‌లో హాట్ డిబేట్‌గా మారింది.

వాటాల విక్రయం..

వాటాల విక్రయం..

టెస్లా, స్పేస్ఎక్స్‌లల్లో తన వాటాలను విక్రయించడానికి సెర్గె బ్రిన్ సిద్ధపడ్డారు. ఈ మేరకు తన ఫైనాన్షియల్ అడ్వైజర్లకు ఆదేశాలను జారీ చేశారు. వీలైనంత త్వరగా టెస్లా, స్పేస్‌ఎక్స్‌లల్లో తన పేరు మీద, తన భార్య పేరు మీద ఉన్న వాటాలు, షేర్లను విక్రయించాలని సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన ఓ ఇమెయిల్‌ను తన ఫైనాన్షియల్ అడ్వైజర్లకు పంపించినట్లు అమెరికన్ మీడియా పేర్కొంది.

English summary
Google co-founder Sergey Brin filed to divorce his wife and all set to sell his personal investments in Elon Musk's companies after he had a brief affair with his wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X