వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: ల్యారీపేజ్: అవుట్.. సుందర్ పిచాయ్‌కు ప్రమోషన్.. గందరగోళంలో గూగుల్ ఆల్ఫాబేట్!

|
Google Oneindia TeluguNews

శాన్ ఫ్రాన్సిస్కో: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సుందర్ పిచాయ్ అదనపు బాధ్యతలను చేపట్టబోతున్నారు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబేట్ పగ్గాలను అందుకోనున్నారు. రాత్రికి రాత్రి చోటు చేసుకున్న పరిణామం ఇది. మాతృసంస్థ ఆల్ఫాబేట్ కు సారథ్యం వహించడం అంటే.. ఓ రకంగా సుందర్ పిచాయ్ కు ప్రమోషన్ లభించినట్టే లెక్క. గూగుల్ సీఈఓగా కొనసాగుతూనే ఆయన ఆల్పాబేట్ కు కూడా ముఖ్య కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు.

Recommended Video

News Roundup : Meet First Women Pilot Shivangi Singh | Sundar Pichai Now Also CEO Of Alphabet
తప్పుకొన్న ల్యారీ పేజ్..

తప్పుకొన్న ల్యారీ పేజ్..

నిన్నటి దాకా ఆల్ఫాబేట్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ల్యారీ పేజ్ కొనసాగారు. గూగుల్ వ్యవస్థాపకుల్లో ఆయనా ఒకరు. ల్యారీ పేజ్, సెర్గె బ్రిన్ కలిసి ఆల్ఫాబేట్ ను స్థాపించిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచే గూగుల్ కు బీజం పడింది. ప్రస్తుతం ఆల్ఫాబేట్ సంస్థ పరిధిలో లైఫ్ సైన్సెస్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీ వంటి కొన్ని ప్రతిష్ఠాత్మకమైన భారీ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వాటన్నింటికీ దిశా నిర్దేశాన్ని చూపించే కీలక బాధ్యతలను సుందర్ పిచాయ స్వీకరించబోతున్నారు.

రాత్రికి రాత్రే..

రాత్రికి రాత్రే..

ఉరుము లేని పిడుగులాగా ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు అభివర్ణిస్తున్నారు పారిశ్రామిక దిగ్గజాలు. ఆల్ఫాబేట్ నుంచి ల్యారీ పేజ్ తప్పుకోవడమే ఓ సంచలనం కాగా.. దాని బాధ్యతలను సుందర్ పిచాయ్ చేతుల్లో పెట్టడం మరో సంచనలంగా భావిస్తున్నారు. ల్యారీ పేజ్ ఎందుకు తప్పుకొన్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఆల్ఫాబేట్ సంస్థ బాధ్యతలను సుందర్ పిచాయ్ కు అప్పగిస్తున్నట్లు ల్యారీ పేజ్, సెర్గె బ్రిన్.. ఆ సంస్థ బోర్డు డైరెక్టర్లకు అధికారికంగా తెలియజేశారు. ఓ లేఖను సైతం సర్కులేట్ చేశారు.

సంస్థ పనితీరు ఎప్పట్టాగే..

సంస్థ పనితీరు ఎప్పట్టాగే..

సారథ్య బాధ్యతలు చేతులు మారినంత మాత్రాన సంస్థ పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉండబోదని, ఎప్పట్లాగే కార్యకలాపాలు కొనసాగుతాయని ల్యారీ పేజ్, సెర్గె బ్రిన్ స్పష్టం చేశారు. సంస్థను మరింత ప్రభావవంతంగా నడిపించాల్సి ఉందని, అందుకే తాము ఆ ప్రతిష్ఠాత్మక బాధ్యతలను సుందర్ పిచాయ్ కు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సుందర్ పిచాయ్ కంటే సమర్థుడైన వ్యక్తి లేరని, అందుకే ఆయన చేతుల్లోనే ఆల్ఫాబేట్ సారథ్య బాధ్యతలు పెట్టినట్లు పేర్కొన్నారు.

2015లో ఏర్పాటైన ఆల్ఫాబేట్

2015లో ఏర్పాటైన ఆల్ఫాబేట్


అమెరికాలోని సిలికాన్ వ్యాలీ కేంద్రంగా 2015లో ఆల్ఫాబేట్ సంస్థ ఆవిర్భవించింది. ఇందులో నుంచే గూగుల్ ప్రత్యేక సంస్థగా ఏర్పాటైంది. ప్రస్తుతం ఆల్ఫాబేట్ స్వతంత్ర యూనిట్ గా కొనసాగుతోంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వైమో తయారీ యూనిట్, స్మార్ట్ సిటీల రూపొందించడానికి ఉద్దేశించిన సైడ్ వాక్ ల్యాబ్స్, కొన్ని లైఫ్ సైన్సెస్ సంస్థలు ప్రస్తుతం ఆల్ఫాబేట్ పరిధిలో ఉన్నాయి. సుందర్ పిచాయ్ కు ఈ సంస్థ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించడం వల్ల.. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులన్నీ ఇక ఆయన ఆధీనంలోకి తీసుకొచ్చినట్టయింది.

English summary
Google chief executive Sundar Pichai will assume the CEO role at parent firm Alphabet in a shakeup at the top of the Silicon Valley titan, the company said Tuesday. Pichai will take over from Larry Page, a co-founder of the internet giant, at the holding firm which includes Google as well as units focusing on "other bets" in areas including self-driving cars and life sciences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X