Fuel Price: సర్కార్ భారీ షాక్- 25 శాతం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!

ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, వాటికి ప్రతిగా ఆ దేశం చేస్తున్న ప్రతీకార దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మీదుగా చమురు నౌకల్ని ఇరాన్ అడ్డుకుంటుండటం అంతర్జాతీయంగా చమురు మార్కెట్లను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు అనివార్యంగా చమురు ధరలు పెంచక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో చమురు ధరలు (fuel price)పెరుగుతున్నాయి.

ఇదే క్రమంలో శ్రీలంక ప్రభుత్వం ఇవాళ 25 శాతం మేర చమురు ధరల్ని పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి ఇది మూడోసారి పెంపు. ఈ వారంలో ఇది రెండోసారి కావడం విశేషం. ప్రపంచ చమురు మార్కెట్లను అల్లకల్లోలం చేస్తున్న ఈ ఘర్షణ నాలుగో వారంలోకి ప్రవేశించడంతో.. శ్రీలంక ప్రభుత్వం ఇవాళ అర్ధరాత్రి నుంచి ఇంధన ధరలను పెంచింది. ఆటో డీజిల్ ధర శ్రీలంక రూపాయల్లో 303 నుంచి 382 కు, సూపర్ డీజిల్ ధర 26.1 శాతం పెరిగింది. లీటర్ పెట్రోల్ రూ.317 నుంచి రూ.398కి చేరింది.

Government hikes fuel price by 25 percent as West Asia conflict hits oil markets

అలాగే పెట్రోల్, డీజిల్ ను పొదుపుగా వాడాలని శ్రీలంక ప్రభుత్వం పౌరులకు పిలుపునిచ్చింది. ఇంధనంతో పాటు విద్యుత్ ను కూడా పొదుపుగా వాడాలని శ్రీలంక ప్రభుత్వం ఓ ప్రకటనలో పౌరులకు సూచించింది. అలాగే ఇంధనం కృత్రిమ కొరతను సృష్టించవద్దంటూ హెచ్చరికలు కూడా చేస్తోంది. ఇప్పటికే ఇంధన కొరత కారణంగా క్యూఆర్ కోడ్ తో వాహనాలకు ఇంధనాన్ని పంపిణీ చేస్తోంది. వారానికి కార్లకు 15 లీటర్లు, బస్సులకు 60 లీటర్లు మాత్రమే పంపిణీ చేస్తోంది. దీంతో శ్రీలంకలో వాహనదారులు అల్లాడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+