మూడేళ్ల లోపు చిన్నారులకు ఏడాదికి రూ.41 వేలు.. ప్రభుత్వం బంపర్ ఆఫర్ !
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైన చైనా ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా జనాభా తగ్గుదల విషయం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి చైనా ప్రభుత్వం వినూత్నమైన చర్యలను చేపట్టింది. మూడేళ్ల లోపు చిన్నారులకు ఏడాదికి రూ.41 వేలు ఇచ్చేందుకు సిద్దం అయ్యింది.
జననాల ప్రోత్సాహానికి కొత్త సబ్సిడీ పథకం..
జననాలను ప్రోత్సహించడానికి చైనా ప్రభుత్వం ఒక కొత్త సబ్సిడీ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద, మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి బిడ్డ తల్లిదండ్రులకు వార్షికంగా 3,600 యువాన్లు (సుమారు రూ. 41,000) సబ్సిడీగా ఇస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా 2025లో జన్మించిన పిల్లలకే కాకుండా, 2022, 2023 లేదా 2024లో జన్మించిన పిల్లలు ఉన్న కుటుంబాలు కూడా ఈ పథకం ద్వారా పాక్షికంగా లబ్ది పొందుతున్నట్టు చెబుతున్నారు. మొత్తంగా ఈ స్కీం ద్వారా సుమారు 20 మిలియన్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంతే కాకుండా ఈ సబ్సిడీని పన్ను రహితంగా అందిస్తున్నట్టు సమాచారం.
జనాభా తగ్గుదలకు కారణాలు..
చైనాలో జననాల రేటు తగ్గడానికి ప్రధాన కారణం "వన్ చైల్డ్ పాలసీ" అని భావిస్తున్నారు. అంతే కాకుండా యువత పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపకపోవడం కూడా మరో కారణంగా చెప్తున్నారు. ఈ పరిస్థితి వల్లే చైనా "వృద్ధ దేశం"గా మారుతోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధుల జనాభా పెరుగుతుండటం, యువ కార్మికుల సంఖ్య తగ్గుతుండటం దేశ ఆర్థిక పురోగతికి ఆటంకం కలిగిస్తోందని స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు గతంలో కంటే చైనాలో మహిళలు అధిక విద్యను అభ్యసిస్తూ ఉద్యోగాలు చేయడం.. ఆ కారణంగా పెళ్లి, పిల్లల పెంపకం గురించి అఆలస్యం జరుగుతుందని అనుకుంటున్నారు. రాజకీయంగా ఇది దేశ భద్రతకు కూడా సవాలుగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే సర్కారు జనాభా పెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించిందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి వీటన్నింటిని అధిగమించడానికి ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ చర్యలు ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications