సెప్టెంబర్ 22.. భారత్- అమెరికా మధ్య ఏం జరగబోతోంది..?

సెప్టెంబర్ 22 న భారత్- అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరగనున్నాయి. ఆ రోజు ఏం జరగబోతోంది..? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ టారిఫ్ లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య వ్యాపార వాణిజ్యాలు క్షీణించిన నేపథ్యంలో అమెరికా పర్యటన చేపట్టింది భారత్.

కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సారథ్యంలోని అధికారుల బృందం అమెరికాలో పర్యటించనుంది. ఈ మేరకు సెప్టెంబర్‌ 22న ట్రంప్ అధికారులతో వాణిజ్య చర్చలు జరపనుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో భారత్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. భారత్ పై ఏకంగా 50 శాతం టారిఫ్ లు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 27 నుంచి భారత వస్తువులపై 50 శాతం టారిఫ్ లు అమలవుతూ వస్తున్నాయి. వాణిజ్య చర్చలకోసం ఇటీవల అమెరికా బృందం భారత్ కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా భారత బృందం అమెరికా వెళ్లనుంది. ఈ మేరకు సెప్టెంబర్ 22 న ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Goyal s US Gamble India-US Trade Talks Heat Up on September 22 Amid Tariff Tensions

రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు భారత్ పై ట్రంప్ టారిఫ్ లు విధించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్ పై టారిఫ్ లు విధించి తద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని ట్రంప్ భావించారు. ఈ క్రమంలోనే భారత్ పై ఏకంగా 50 శాతం టారిఫ్ లు విధించారు.అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత్ నుంచి అగ్రరాజ్యానికి ఎగుమతయ్యే 48 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై సుంకాలు ప్రభావం పడనున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ట్రేడ్ వార్ ను తగ్గించుకునేందుకు ఇరు దేశాలు ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+