గ్రెనేడ్ తో దాడి, కాల్పులు: మంత్రి సోదరుడి మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో ఉగ్రవాదులు పంజా విసిరారు. ఈసారి ఏకంగా మంత్రి కార్యాలయంపై హ్యాండ్ గ్రెనేడ్ లు విసిరి తుపాకులతో కాల్పులు జరపడంతో మంత్రి సోదరుడు దుర్మరణం చెందాడు. ఇదే దాడిలో ఆరుగురికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సింధ్ ప్రావిన్స్ ప్రాంతానికి మంత్రి అయిన అబాదీ జావెద్ నగోరికి ఒక కార్యాలయం ఉంది. మంత్రి నగోరి సోదరుడు అక్బర్ నగోరి. శుక్రవారం రాత్రి అక్బర్ నగోరి తదితరులు మంత్రి కార్యాలయం దగ్గర ఉన్నారు. ఆ సమయంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.
మంత్రి కార్యాలయం మీద హ్యాండ్ గ్రెనేడ్ లు విసిరి, తుపాకులతో ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపారు. భద్రతా సిబ్బంది తేరుకునే లోపు ఉగ్రవాదులు అక్కడి నుండి పరారైనారు. ఈ దాడిలో మంత్రి సోదరుడు అక్బర్ తో సహ 7 మంది కి తీవ్రగాయాలైనాయి.

వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై అక్బర్ నగోరి మరణించాడని ఇస్లామాబాద్ పోలీసు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న సింధ్ ముఖ్యమంత్రి ఖయిూమ్ ఆలీ షా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
ఉగ్రవాదులు దాడులు చెయ్యడం సిగ్గు చేటు అని ఆలీ షా అన్నారు. వెంటనే దర్యాప్తు చెయ్యాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెషావర్ లో సైనిక పాఠశాలపై ఉగ్రవాదులు దాడులు చెయ్యడం, వారి మీద పాకిస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications