షాకింగ్: తల్లి చితాభస్మాన్ని నంజుకుతింటున్న కూతురు!

మనిషి చితాభ్మసాన్ని ఎవరైనా తింటారా? అదీ కూరల్లో కలుపుకొని, వివిధ ఆహారపదార్థాలపై చల్లుకుని? వినడానికే విచిత్రంగా ఉంది కదూ! కానీ ఇది నిజం.

టర్కీ: మనిషి చితాభ్మసాన్ని ఎవరైనా తింటారా? అదీ కూరల్లో కలుపుకొని, వివిధ ఆహారపదార్థాలపై చల్లుకుని? వినడానికే విచిత్రంగా ఉంది కదూ! కానీ ఇది నిజం. టర్కీకి చెందిన డెబ్రా పర్సన్స్ తన తల్లి చితాభస్మాన్ని టర్కీ రోస్ట్‌పై చల్లుకుని తినేసింది.

డెబ్రా పర్సన్స్.. వయసు 41. ఆమెకు తన తల్లి అంటే ఎనలేని అభిమానం. తల్లి లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేదు. కానీ.. దురదృష్టవశాత్తు గత మే నెలలో డెబ్రా తల్లి డొరీన్ చాతి నొప్పి రావడంతో చనిపోయింది.

debra-parsons

తల్లి హఠాన్మరణంతో డీలా పడిపోయింది డెబ్రా. తల్లి తనను ఒంటరిని చేసి వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోయింది. తల్లి జ్ఞాపకాలను విడవలేకపోయింది. తల్లి చనిపోయినా.. ఆమె జ్ఞాపకాలు తనతో ఉండాలని తల్లి చితాభస్మాన్ని ఇలా వంటల్లో కలుపుకొని తినేస్తోంది.

ప్రతి రోజు కొంచెం చితాభస్మాన్ని కూరల్లో కలుపుకొని తినేస్తున్నదట. అలా తింటే.. తన తల్లి ఎప్పుడూ తనతో ఉన్న ఫీలింగ్ కలుగుతుందట డెబ్రాకు. ఇక.. ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా.. క్రిస్మస్ లంచ్‌లో తన తల్లి చితాభస్మాన్ని టర్కీ రోస్ట్‌లో కలుపుకొని ఏంచక్కా లాగించేస్తుందట. అలా చేస్తే.. తన తల్లితో కలిపి క్రిస్మస్ జరుపుకున్నట్లు భావిస్తానని డెబ్రా చెబుతోంది.

''నేను చేస్తున్నది కరెక్ట్ కాదని నాకు తెలుసు.. కానీ నేనిలా చేయకుండా ఉండలేకపోతున్నాను. నన్ను పిచ్చిది అని అనుకున్నా సరే.. ఇలా చేయడం మాత్రం నేను ఆపలేను. నా తల్లి బూడిదను తినడం వల్ల తను నాలో బతికే ఉంటుందనే భావన నాకు ధైర్యాన్ని ఇస్తోంది. నా తల్లి నా శరీరంలో ఒక భాగంలా ఉంటుంది. నా శ్వాసే తన శ్వాస.." అంటూ డెబ్రా చెబుతోంది.

అంతేకాదు, ''అమ్మ చనిపోయిన రెండు నెలలకు తన చితాభస్మాన్ని నా సోదరి తీసుకొచ్చి నాకు ఇచ్చింది. ఆ బాక్స్‌ను ఓపెన్ చేసి మొదటిసారి బూడిదలో వేలు పెట్టి ఒకసారి టేస్ట్ చేశాను. అది కొంచెం ఉప్పుప్పుగా ఉన్నా సరే.. నాకు మాత్రం చాలా టేస్టీగా అనిపించింది. అసలు నేనేం చేస్తున్నాను.. అని నామీద నాకే అసహ్యం వేసినా.. ఆ పని చేయకుండా మాత్రం ఉండలేకపోతున్నాను ఇక అప్పట్నించి రోజు నేను తినే ఆహారంలో తన బూడిదను కలుపుకొని తినేస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చింది డెబ్రా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+