విషాదం: పెళ్ళైన కొన్ని గంటల్లోనే వరుడు మృతి, వధువుకు అస్వస్థత, ఏమైందంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

మక్కా:కొత్తగా పెళ్ళైంది. ఆనందంగా కొత్త అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ఆనందంగా ఆ కొత్త అపార్ట్‌మెంట్‌లోకి అడుగుపెట్టారు. అయితే పెళ్ళైన పది గంటలకే ఆ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం సంబవించింది. ఈ ప్రమాదంలో కొత్త పెళ్ళికొడుకు మరణించాడు, పెళ్ళికూతురు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన మక్కాకు సమీపంలోని ఈ ఘటన చోటు చేసుకొంది.

అఫ్ఘనిస్తాన్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడికి సౌదీలోని మదీనాలో ఓ యువతితో వివాహం జరిగింది. అనంతరం మక్కాలో కొత్తగా కొనుగోలు చేసిన వారి అపార్ట్‌మెంట్‌కు ఆనందంగా వెళ్లారు.

Groom dies in tragic fire hours after wedding in Saudi Arabia

కింది అంతస్థులో చెలరేగిన మంటలు పైకి ఎగబాకడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి.

దట్టమైన పొగ అలుముకోవడంతో అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న మిగతావారిని అక్కడి నుంచి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాల తెలియాల్సి ఉందని, విచారణ ప్రారంభించామని మక్కా సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిధి అల్ షరీఫ్ తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hours after he got married, an Afghani groom in his 20s died in a fire that gutted the flat where he and his bride spent the night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X