Indecent: బాల్కనీలో నగ్నంగా తెల్ల తోలు అమ్మాయిలు: పబ్లిగ్గా ముద్దులు: గ్రూప్ సరసం
దుబాయ్: దుబాయ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కొందరు అమ్మాయిలు ఒంటి మీద నూలు పోగు లేకుండా పట్టపగలు పరేడ్ నిర్వహించారు. మందు కొడుతూ కైపెక్కించారు. పట్టపగలు అశ్లీలంగా పవర్తించారు. ఒకరు కాదు.. ఇద్దరు.. ఏకంగా రెండు డజన్ల మంది అమ్మాయిలు అసభ్యకరంగా వ్యవహరించారు. ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. ఈ తతంగం అంతటినీ స్థానికులు వీడియోలు తీశారు. వీడియోలు తీస్తున్నారనే విషయం తెలిసినప్పటికీ.. ఆ అమ్మాయిలు పట్టించుకోలేదు. తమ చేష్టలతో మరింత రెచ్చిపోయారు.

పట్టపగలు..బాల్కనీలో..
దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అవి తమ దృష్టికి వచ్చిన వెంటనే దుబాయ్ పోలీసులు రంగంలోకి దిగారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దుబాయ్‌లో ధనవంతులు నివసించే మెరీనా మార్కెట్ ఏరియాలోని ఓ అపార్టుమెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలు బాల్కనీలో 20 మందికి పైగా అమ్మాయిలు నగ్న ప్రదర్శన చేశారు. ఒంటిమీద నూలుపోగు లేకుండా రెయిలింగ్‌ను పట్టుకుని ఫొటోలు తీసుకున్నారు. సెల్ఫీలతో ఎంజాయ్ చేశారు. ఫొటోలు దిగారు. పబ్లిగ్గా మందు కొట్టారు. మద్యం మత్తులో ముద్దులు పెట్టుకున్నారు. సరస సల్లాపాల్లో మునిగి తేలారు.

సోషల్ మీడియాలో వైరల్..
వారి విశృంఖలత్వానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగానే దుబాయ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వారందరినీ అరెస్టు చేశారు. సంప్రదాయానికి, కట్టుబాట్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చే దేశం కావడం వల్ల వారిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బహిరంగంగా మద్యం సేవించడం సైతం దుబాయ్‌లో నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం మందు కొట్టడం వంటి చర్యలను నిరోధించడానికి రూపొందించిన చట్టాల కింద ఆ డజనుమంది అమ్మాయిలపై కేసు పెట్టినట్లు దుబాయ్ పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

పలు సెక్షన్ల కింద కేసులు..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సమాజం ఇలాంటి చర్యలను ఎంత మాత్రమూ ప్రోత్సహించబోదని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ఎవరు తీసుకున్నా శిక్షలు, జరిమానాలు ఒకేరకంగా ఉంటాయని స్పష్టం చేశారు. దుబాయ్ చట్టాల ప్రకారం.. ఆ మహిళలందరికీ కనీసం ఆరునెలలు చొప్పున జైలు శిక్ష పడే అవకాశం ఉంది. లేదా వెయ్యి దిర్హాంల మేర జరిమానా, లేదా రెండూ కలిపి విధించవచ్చని చెబుతున్నారు. వారిపై కేసు నమోదు చేసిన అనంతరం ఈ కేసును న్యాయస్థానానికి రెఫర్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వారిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.