గిన్నీస్ రికార్డ్ : ఒకే కాన్పులో తొమ్మిది మంది.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే ?
2021 మే 4వ తేదీ.. ఆ రోజు ప్రపంచం అంతా ఒక్కసారిగా షాక్ అయిన ఘటన చోటు చేసుకుంది. మాలి దేశానికి చెందిన 25 ఏళ్ల విద్యార్థిని హలీమా సిస్సే.. తన భర్త అబ్దెల్ ఖాదర్ అర్బీ చరిత్ర సృష్టించారు. మొరాకోలోని కాసాబ్లాంకాలో ఆమె ఒకే కాన్పులో తొమ్మిది మందికి జన్మనిచ్చింది. ఇది ప్రపంచంలోనే అరుదైన సంఘటనగా నిలిచి, గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా ఆమె పేరు నమోదైంది.
కాగా ముందుగా హలీమా గర్భధారణ సమయంలో వైద్యులు ఏడు శిశువులు ఉన్నారని భావించారు. కానీ మాలి ప్రభుత్వం ఆమెను మొరాకోలోని ఐన్ బోర్జా క్లినిక్కు తరలించడంతో అక్కడి ఆధునిక స్కానింగ్ పరికరాలు గర్భంలో ఇంకా ఇద్దరు శిశువులు ఉన్నట్లు నిర్ధారించాయి. దీనితో తొమ్మిది మంది శిశువులకు జన్మనిచ్చింది. తొమ్మిది మంది శిశువుల్లో ఐదుగురు బాలికలు, నలుగురు బాలురు ఉన్నారు.

సిజేరియన్ సర్జరీ ద్వారా పిల్లలకు జన్మించారు. పుట్టినపుడు ప్రతి శిశువు బరువు 0.5 నుంచి 1 కిలో మధ్య ఉండింది. డెలివరీ కోసం 32 మంది వైద్య సిబ్బంది నిరంతరం పని చేశారు. అనంతరం శిశువులను ఇంక్యుబేటర్లలో ఉంచి నెలల తరబడి ప్రత్యేక నిఘాలో ఉంచారు. హలీమాకు కూడా డెలివరీ అనంతరం శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. మొరాకోలో 19 నెలలు గడిపిన తర్వాత, ఈ కుటుంబం మాలికి తిరిగి వచ్చింది.
పిల్లల పేర్లు అడామా, ఒమౌ, హవా, కడిడియా, ఫాటౌమా.. మహమ్మద్ VI, ఒమర్, ఎల్హాజీ, బహ్... పేర్లు పెట్టారు. 2025 మే 4న ఈ తొమ్మిది మంది పిల్లలు నాల్గవ పుట్టినరోజు జరుపుకున్నారు. హలీమా, అబ్దెల్ ఖాదర్ తమ సోషల్ మీడియా ఖాతాలలో పిల్లల ఫోటోలు షేర్ చేయగా, అందులో గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ కూడా ఉంది. ఈ మధుర క్షణాలను మరువలేం.. అపారమైన ప్రేమ.. అద్భుతమైన అనుభూతి" అంటూ దంపతులు వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల వయస్సు ఈ పిల్లలు ఇప్పుడు చాలా యాక్టివ్ గా, ఆరోగ్యంగా ఎదుగుతున్నారు.












Click it and Unblock the Notifications