విమానంపై ఉగ్రవాదుల కాల్పులు: ఒకరు మృతి

Gunmen Fire on Plane at Pakistan's Peshawar Airport, One Killed
పెషావర్: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. ఇటీవల కరాచీ విమానాశ్రయంపై దాడిచేసి రక్తపాతం సృష్టించిన ఉగ్రవాదులు ఈసారి పెషావర్ విమానాశ్రయంపై పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో రియాధ్ నుంచి వచ్చిన పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) విమానం పెషావర్ విమానాశ్రయంలో దిగుతుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

ఈ సంఘటనలో ఒక మహిళా ప్రయాణికురాలు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. అధికారులు మాత్రం కాల్పుల్లో ఎవరూ చనిపోలేదని, ఇద్దరు ప్రయాణికులు క్షతగాత్రులయ్యారని తెలిపారు. విమానంలో 178 మంది ప్రయాణికులు ఉన్నారని, విమానం దిగుతుండగా సమీపంలోని నివాస ప్రాంతం నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, పిఐఎ అధికార ప్రతినిధి చెప్పారు.

ఇది ఉగ్రవాదుల పనేనా, విమానాన్ని లక్ష్యంగా చేసుకునే కాల్పులు జరిపారా అనేది నిర్ధారించుకోవాల్సి ఉందని చెప్పారు. ఈ ప్రాంతంలో అకారణంగా గాలిలోకి కాల్పులు జరపడం సహజమని పీఐఏ అధికార ప్రతినిధి తెలిపారు.

ఈనెల 8వ తేదీన 10 మంది ఉగ్రవాదులు కరాచీ విమానాశ్రయాన్ని ముట్టడించి 29 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఆ తర్వాత అన్ని విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేసినా పెషావర్‌లో మరోమారు కాల్పులు జరగడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+