18 మందిని కాల్చి చంపేసిన గ్యాంగ్ స్టర్స్
బ్రెజిల్: దుండగుల జరిపిన కాల్పులలో 18 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పలువురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరు మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారని పోలీసు అధికారులు తెలిపారు.
బ్రెజిల్ లోని సావోపో నగరంలోని బారౌరీ ప్రాంతంలోకి శుక్రవారం రాత్రి ముసుగులు వేసుకున్న కొందరు దుండగులు ఒక వాహనంలో వెళ్లారు. తరువాత అక్కడ ఉన్న వారి వివరాలు అడిగారు. ఆ పరిసర ప్రాంతాలలో వరుసగా కాల్పులు జరిపారు.
ఆ సందర్బంలో బుల్లెట్ లు దూసుకు వెళ్లడంతో పలువురు అక్కడే ప్రాణాలు వదిలిపెట్టారు. తరువాత సమీపంలోని బార్ లోకి వెళ్లి అక్కడ కాల్పులు జరిపారు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వచ్చేలోపు దుండగులు అక్కడి నుండి పరారైనారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యక్షసాక్షుల నుండి వివరాలు తెలుసుకున్నామని పోలీసులు తెలిపారు.
అత్యున్నత స్థాయి పోలీసు అధికారులతో దర్యాప్తు చేయిస్తున్నారు. అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేసే గ్యాంగ్ లు వారి ఆధిపత్యం కోసం అప్పుడప్పుడు ఈ విధంగా కాల్పులు జరుపుతుంటారని స్థానిక మీడియా వెల్లడించింది.












Click it and Unblock the Notifications