జమాత్ ఉద్ దవాకు హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ కొత్త చీఫ్
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవాకు కొత్త చీఫ్ బాద్యతలు స్వీకరించాడు. ఇప్పటివరకు అధినేతగా ఉన్న హఫీజ్ సయీద్ గృహనిర్భందంలో ఉండడంతో అతడి బావ మరింది హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీని ఆ సంస్థకు అధిపతిగా
లాహోర్:అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవాకు కొత్త చీఫ్ బాద్యతలు స్వీకరించాడు. ఇప్పటివరకు అధినేతగా ఉన్న హఫీజ్ సయీద్ గృహనిర్భందంలో ఉండడంతో అతడి బావ మరింది హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీని ఆ సంస్థకు అధిపతిగా నియమించారు.
అతడిని పట్టిస్తే రూ.13 కోట్ల రూపాయాలను బహుమతిని ఇస్తామని ప్రకటించారు. కొత్త బాస్ మక్కీ అనే విషయాన్ని జమాత్ ఉద్ దవా అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం మక్కీ జెయూడీలో నెంబర్ 2 గా ఉన్నాడు. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రభుత్వం సయీద్ ను గృహ నిర్భంధంలో ఉంచింది.
గృహ నిర్భందంలోనే ఉన్నా ఇంటి నుండే హఫీజ్ సయీద్ కార్యకలాపాలను సాగిస్తున్నాడన్న ప్రచారం కూడ లేకపోలేదు.
ఈ విషయాలను మక్కీయే చూసుకొంటున్నాడని చెప్పింది. హఫీజ్ సయీద్ నిర్భంధం తర్వాతి నుండి ఇప్పటివరకు మక్కీ లాహోర్ నగరంలోనే దాదాపుగా ఆరు ర్యాలీలను నిర్వహించారు.

పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రభుత్వం జమాత్ ఉద్ దవాతో పాటు మరో నలుగురు జెయూడీ నేతలను ఫలా ఎ ఇన్సానీయత్ నేతలను 90 రోజుల పాటు గృహ నిర్భందంలో ఉంచింది. ఈ రెండు సంస్థలకు చెందిన పలు కార్యాలయాలను కూడ మూసేశారు. ఈ రెండింటిని ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద పరిశీలనలో ఉంచారు. సయీద్ గృహ నిర్భంధం తర్వాత జెయూడీ తన పేరును మార్చుకొంది. తెహరీక్ అజాదీ జమ్మూ కాశ్మీర్ అనే కొత్త పేరుతో కార్యకలాపాలను సాగిస్తోంది.












Click it and Unblock the Notifications