నెంబర్ వన్ ఎనిమీ: మరోసారి భారత్‌పై విషం కక్కిన సయీద్
పెషావర్: జమాత్ - ఉల్, దావా చీఫ్ హఫీజ్ సయీద్ మరోసారి భారతదేశంపై విషం కక్కారు. పాకిస్తాన్‌ను నెంబర్ వన్ శత్రువు భారతదేశమేనని ఆయన అన్నట్లు శనివారం వార్తాపత్రికలురా రాశాయి. పెషావర్‌లో జరిగన ఓ ర్యాలీలో ఆయన ప్రసంగించాడు.
పాకిస్తాన్ ప్రథమ శత్రువు భారతదేశమేనని, పాకిస్తాన్ తొలి లక్ష్యం భారత్ అని, భారత్‌పై జీహాద్‌ను వేగవంతం చేయాలని ఆయన అన్నారు.

భారత్‌పై జిహాద్ చేస్తామంటే పాకిస్తాన్ సహాయానికి తాు సిద్ధంగా ఉన్నామని ఆయన రెండు రోజుల క్రితమే అన్నారు. భారత వ్యతిరేకత సెంటిమెంటును రెచ్చగొట్టడం వల్ల ఉద్రవాదంతో, హింసతో పాకిస్తాన్ వణికిపోతుందని ఆయన అన్నారు.
పాకిస్తాన్‌పై భారత్ దాడి చేయాలని ప్రయత్నిస్తోందని హఫీజ్ పలుమార్లు అన్నాడు. 250 మరణించిన పెషార్ స్కూల్ దాడిపై కూడా ఆయన భారతదేశాన్ని నిందించారు.












Click it and Unblock the Notifications