పాక్‌లో ఉగ్రవాద స్థావరాలపై అమెరికా డ్రోన్ దాడులు: ముగ్గురి మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై అమెరికా బుదవారం నాడు డ్రోన్ల సహయంతో దాడులు నిర్వహించింది. పాకిస్తాన్-అప్ఘనిస్తాన్ సరిహద్దులో అమెరికా చేసిన దాడిలో హక్కానీ నెట్‌వర్క్‌కు చెందిన ఒక కమాండర్, ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం.
ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబల్ ఏరియాలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు సమాచారం అందడంతో అమెరికా డ్రోన్‌తో దాడి చేయాలని నిర్ణయించింది. అనుమానిత స్థలంపై డ్రోన్‌తో రెండు మిస్సైళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మరణించారని సమాచారం.

అప్ఘనిస్తాన్‌లో తరచూ ఉగ్ర దాడులకు పాల్పడుతున్న హక్కానీ నెట్‌వర్క్‌ను అంతం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకొన్నాడు. ఇందులో భాగంగా హక్కానీ కమాండర్లకు తలదాచుకోవడానికి అవకాశం కల్పిస్తున్న పాకిస్తాన్‌కు ఆర్థిక సాయాన్ని కూడా ఆయన నిలిపివేశారు
అమెరికా డ్రోన్ దాడిని పాకిస్తాన్ ఖండించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ సాయం చేస్తోందని ట్రంప్ చేసిన ఆరోపణలను ఆ దేశం కొట్టిపారేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications