వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల్లి డబ్బు ఆదా చేద్దామనుకుంటే, జాయింట్ వీల్ ఎక్కిన 5ఏళ్ల బాలుడు గాల్లో వేలాడుతూ...

|
Google Oneindia TeluguNews

Recommended Video

తల్లి డబ్బు ఆదా చేద్దామనుకుంటే, జాయింట్ వీల్ ఎక్కిన 5ఏళ్ల బాలుడు గాల్లో వేలాడుతూ..

బీజింగ్: చైనాలో ఓ కుటుంబం సరదాగా బయటకు వెళ్లింది. ఫెర్రిస్ వీల్‌లో (జాయింట్ వీల్ లేదా రంగుల రాట్నం లాంటిది) కొడుకును తిప్పాలనుకున్నారు. అయితే అది కాస్త వారికి ఒకింత చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ ప్రమాదం నుంచి బాలుడు బతికి బయటపడ్డాడు. కానీ ఆ చేదు అనుభవం మాత్రం వారికి గుర్తుకు వచ్చినప్పుడల్లా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.

ఫెర్రీస్ వీల్‌లో చిక్కుకున్న బాలుడు

ఫెర్రీస్ వీల్‌లో చిక్కుకున్న బాలుడు

ఇందుకు సంబంధించిన వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. ఆ వీడియోలో బాలుడు ఫెర్రిస్ వీల్‌లో ఇరుక్కుపోయి, గాల్లోనే చిక్కుకుపోయాడు. ఫెర్రిస్ వీల్ నడిపేవారు చాలా జాగ్రత్తగా అతనిని కిందకు దించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బాలుడి వయస్సు కేవలం 5 ఏళ్లు.

ఆ తల్లి డబ్బులు ఆదా చేసేందుకు

ఆ తల్లి డబ్బులు ఆదా చేసేందుకు

ఈ సంఘటన చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్‌లో గల తైజో యుహున్ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో సెప్టెంబర్ 24వ తేదీన చోటు చేసుకుంది. అయిదేళ్ల బాలుడితో కలిసి తల్లి, ఇతరులు ఈ పార్క్‌కు వెళ్లారు. ఫెర్రిస్ వీల్ పైన తన అయిదేళ్ల కొడుకును తిప్పాలని వారిని కోరింది. అతను చిన్న పిల్లవాడు కాబట్టి వారు ససేమీరా అన్నారు. అయితే ఆమె వారిని బతిమాలి ఫెర్రిస్ వీల్‌లో ఎక్కించింది. కేవలం కొడుకునే ఎక్కించడం ద్వారా ఆ తల్లి 30 యువాన్లు (మన రూపాయల్లో రూ.316) ఆదా చేయాలని భావించింది.

 ఇరుక్కుపోయి బాడీ వేలాడింది

ఇరుక్కుపోయి బాడీ వేలాడింది

బాలుడు ఒక్కడే ఫెర్రీస్ వీల్‌లో ఎక్కించారు. ఫెర్రీస్ వీల్ తిరగడం ప్రారంభమైంది. అది పైకి చేరుకున్న తర్వాత ఆ బాలుడు క్యారియేజ్ డోర్‌ను తెరిచి తన కాళ్లను, బాడీను బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడు. అతను అందులో ఇరుక్కుపోయాడు. ఇలా ఇరుక్కుపోవడంతో అతను కిందపడలేదు.

స్వల్ప గాయాలు మినహా సేఫ్

బాలుడు దాదాపు 130 అడుగుల ఎత్తులో అందులో చిక్కుకుపోయాడు. అతని తల ఫెర్రీస్ వీల్‌లో చిక్కుకొని, బాడీ అంత బయట ఉండి వేళ్లూడుతూ కనిపించాడు. ఇది గమనించిన ఫెర్రీస్ వీల్ రైడర్స్ జాగ్రత్తగా అతనిని కిందకు దించేందుకు ప్రయత్నాలు చేశారు. మెల్లిగా భూమి వరకు తీసుకు వచ్చి అతనిని కాపాడారు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అతనికి స్వల్ప గాయాలు మినహా ఏం కాలేదని డాక్టర్లు చెప్పారు.

English summary
A family's day out at an amusement park in China turned into the stuff of nightmares after a scary incident involving their five-year-old. A video shared online shows a boy dangling by the neck on a Ferris wheel. Thankfully, though, ride operators worked carefully to rescue the boy and he reportedly escaped with only minor injuries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X