Viral Video:ప్రధాని మోదీ పాదాలకు నమస్కరించిన ఆ అమెరికన్ సింగర్ ఎవరు..?

ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది.ఓ వైపు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మరో వైపు అతిపురాతన ప్రజాస్వామ్య దేశాలు ఒకే వేదికపైకి రావడంతో ప్రపంచ దేశాలు ఈ స్నేహబంధాన్ని మరింత నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇక మోదీ మేనియా అమెరికాలో మామూలుగా లేదు. ప్రధాని మోదీ అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశం సందర్భంగా కొన్ని అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేశాయి.

అమెరికా కాంగ్రెస్ సమావేశంలో మోదీ ప్రసంగం ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. మోదీ మాట్లాడిన ప్రతి మాటకు సభలోని సభ్యులు చప్పట్లు కొట్టారు. మోదీ ప్రసంగం తర్వాత అమెరికా ప్రజాప్రతినిధులు ఆయనతో ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడిన విషయం తెలిసిందే. ఇక ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా చివరి రోజున జరిగిన కార్యక్రమంలో ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది.

 modi

అమెరికాకు చెందిన గాయని మేరీ మిల్‌బెన్ ప్రధాని మోదీకి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకుంది. భారతదేశం జాతీయ గీతం జనగణమన ఆలపించిన అనంతరం మేరీ మిల్‌బెన్ నేరుగా ప్రధాని మోదీ వద్దకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించింది.ఈ అద్భుత దృశ్యానికి వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ మరియు ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ వేదికగా నిలిచింది.

ఆఫ్రికన్- అమెరికన్ హాలీవుడ్ నటి మరియు గాయని మేరీ మిల్‌బెన్ భారత్‌కు చెందిన జాతీయగీతం జనగణమన, ఓమ్ జై జగదీశ్‌ హరే పాటలు పాడటం ద్వారా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ప్రధాని మోదీ ముందు భారత జాతీయ గీతం ఆలపించడం తన పూర్వ జన్మ సుకృతమని కార్యక్రమానికి ముందు మిల్‌బెన్ అన్నారు. ఇప్పటి వరకు నలుగురు అమెరికా అధ్యక్షుల ముందు అమెరికా జాతీయగీతం పాడే అవకాశం దక్కిందని చెప్పిన మిల్‌బెన్... ప్రధాని మోదీ ముందు తన కుటుంబంగా భావించే అమెరికాలో స్థిరపడ్డ భారతీయుల ముందు ప్రదర్శన ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.

అమెరికా-భారత్‌ రెండు దేశాలు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను గురించి మాట్లాడతాయని అందుకే ఈ రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలు రోజురోజుకూ బలపడుతున్నాయని మిల్‌బెన్ చెప్పుకొచ్చారు.స్వేఛ్చాయుత దేశంకు నిర్వచనం అక్కడ స్వేఛ్ఛగా జీవించే ప్రజలే అని అన్నారు.

ఇక ప్రధాని మోదీ గత నెలలో పాపువా న్యూగినియాలో పర్యటించిన సమయంలో ఆ దేశ ప్రధాని మోదీ పాదాలకు నమస్కరించారు. పాపువా న్యూగినియా పర్యటన ముగిసిన అనంతరం ఆ దేశ ప్రధాని విమానాశ్రయంలో మోదీ పాదాలకు నమస్కరించగా తిరిగి మోదీ రెండు చేతులు జోడించి వారికి నమస్కరించారు. ఆ సమయంలో ఇటు జాతీయ పత్రికలు అటు అంతర్జాతీయ పత్రికలు ప్రధాన శీర్షికతో కథనాలను ప్రచురించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+