పెళ్లికని తీసుకెళ్లి.. ఏకంగా జైల్లో దించాడు! సింపుల్ గా ‘సారీ’ చెప్పేశాడు!!

Posted By:
Subscribe to Oneindia Telugu

ఢాకా: పెళ్లి కోసం బయల్దేరిన ఓ బృందం తాము ఏకంగా జైల్లో దిగామని తెలుసుకుని షాక్ తిన్నారు. కట్టుదిట్టమైన భద్రత గల ఆ జైల్లో ఉన్నట్లుండి ఓ ప్రైవేట్ హెలికాప్టర్ దిగడంతో జైలు అధికారులు కూడా కంగుతిన్నారు.

విచారణ అనంతరం పైలట్ పొరపాటున హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసినట్టు తెలుసుకుని అందర్నీ వదిలేశారు. బంగ్లాదేశ్‌లోని కాశింపూర్‌ ప్రాంతంలో ఉన్న సెంట్రల్‌ జైలులో ఈ ఘటన చోటుచేసుకుంది.

గురువారం ఓ ప్రైవేటు హెలికాప్టర్‌ పెళ్లి బృందాన్ని తీసుకుని బయల్దేరింది. మలేసియాలో నివసిస్తున్న ఇద్దరు దంపతులు తమ పిల్లల్ని తీసుకుని అద్దె హెలికాప్టర్‌లో వెళ్లారు. మరికొద్ది సేపట్లో పెళ్లి ఇంట దిగుతామనగా... పైలట్ హెలికాప్టర్‌ను పొరపాటున జైల్లో దించేశాడు.

Helicopter carrying wedding party mistakenly lands in prison in Bangladesh

జైలు అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. తప్పు గ్రహించిన పైలట్... హెలికాప్టర్‌తో సహా అక్కడి నుంచి ఉడాయించాడు.

దీనిపై అధికారులు వివరణ ఇస్తూ.. ''ఇది పైలట్ పొరపాటు వల్లే జరిగినా... జైలు సిబ్బందిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ జైల్లో తీవ్రవాదులు ఖైదీలుగా ఉంటున్నారు.. వారిని విడిపించేందుకు ఎప్పుడైనా ఉగ్రదాడి జరగొచ్చని ఇంటిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే హెలికాప్టర్ ఘటన చోటు చేసుకోవడంతో అందర్నీ అదుపులోకి తీసుకున్నాం. అయితే విచారణలో వారంతా బంగ్లాదేశ్‌కి చెందిన ఒకే కుటుంబమని తెలిసి వదిలిపెట్టాం..'' అని ఆ దేశ జైళ్ల శాఖ ఐజీ బ్రిగేడియర్ జనరల్ సయ్యద్ ఇఫ్తెకారుద్దీన్ వెల్లడించారు.

హెలికాప్టర్ ను నడిపిన పైలట్ బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన మాజీ అని చెబుతున్నారు. హెలికాప్టర్ యాజమాన్య కంపెనీ క్షమాపణ చెప్పిందనీ.. విచారణ అనంతరం ఆ కుటుంబాన్ని సమీప గ్రామంలోని పెళ్లికి అనుమతించామని జైలు అధికారులు పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A private helicopter carrying a wedding party landed by mistake inside a high security prison on Thursday, sparking massive security concerns amid reports that terrorists were planning an attack on the jail to free the militant inmates. According to the officials the guards at Kashimpur Central Jail detained the five passengers, all members of an expatriate Bangladeshi family, for a brief period but the pilot, reportedly a retired air force officer, flew away with the plane after sensing his mistake.“This happened by mistake but the incident made us concerned as there are intelligence reports that terrorists could launch attacks to free militant inmates from this jail,” said Inspector General of prisons Brigadier General Syed Iftekhar Uddin.
Please Wait while comments are loading...