ఉగ్రదాడి: పోలీసును కాపాడేందుకు ప్రాణాలకు తెగించి మంత్రి సాహసం

Subscribe to Oneindia Telugu

లండన్‌: బ్రిట‌న్ పార్ల‌మెంట్ వ‌ద్ద జ‌రిగిన ఉగ్ర‌దాడిలో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. కానీ, ఆ అధికారిని కాపాడేందుకు బ్రిటన్ ఎంపీ తొబియాస్ ఎల్‌వుడ్ తీవ్ర ప్ర‌య‌త్నం చేశారు. రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ పోలీసును చూసిన విదేశంగా మంత్రి కూడా అయిన ఆ ఎంపీ.. ప్రమాదమని తెలిసినా.. తన భద్రతను కూడా పట్టించుకోకుండా ఆ పోలీసును కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు.

షాక్: బ్రిటన్ పార్లమెంటు వద్ద కాల్పుల బీభత్సం, పలువురికి గాయాలు

పార్ల‌మెంట్ స్క్వేర్ వ‌ద్దకు మెడిక‌ల్ స్టాఫ్‌, అంబులెన్స్ వ‌చ్చే వ‌ర‌కు సదరు ఎంపీ.. అతనికి ప్ర‌థ‌మ చికిత్స అందిస్తూనే ఉన్నారు. ఎంపీ ఎల్‌వుడ్ చూపించిన తెగువ‌ను ఆ దేశ ఎంపీలు ప్రశంసించారు. హీరో ఎల్‌వుడ్ అంటూ ఎంపీలు ఆయనపై సోష‌ల్ మీడియాలో ట్వీట్లు కురిపించారు.

ఉగ్రదాడి

ఉగ్రదాడి

బ్రిటిష్‌ పార్లమెంట్‌ సముదాయంలో బుధవారం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారు. పార్లమెంట్‌ ప్రధాన ప్రవేశ ద్వారం నుంచి లోనికి వచ్చేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అడ్డుకున్న పోలీస్‌ అధికారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనతో పార్లమెంట్‌లో ఎంపీలంతా కొంతసేపు బందీలుగా లోపలే ఉండిపోయారు. ఇంతలో బ్రిటిష్‌ కన్సర్వేటివ్‌ ఎంపీ, విదేశాంగ మంత్రి తోబియాస్‌ ఎల్‌వుడ్‌.. బాధిత అధికారిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి, సెక్యూరిటీని పక్కనబెట్టి భవనం నుంచి బయటకొచ్చారు.

రక్తపు మడుగులో అధికారి..

రక్తపు మడుగులో అధికారి..

గది బయట రక్తపుమడుగులో పడి ఉన్న పోలీస్‌ అధికారిని చూసిన తోబియాస్‌ వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించారు. కొనఊపిరితో ఉన్న పోలీస్‌కు నోటి ద్వారా కృత్రిమశ్వాస అందించారు. గుండెకు రక్తప్రసరణ అయ్యేలా ఛాతీపై కొడుతూ ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాడు.

ఫలితం లేకపోయింది..

ఫలితం లేకపోయింది..

అయితే తోబియాస్‌ ప్రయత్నం ఫలించలేదు. తీవ్ర రక్తస్రావమైన ఆ పోలీస్‌ అధికారి కాసేపటికి ప్రాణాలు కోల్పోయాడు. రాజకీయాల్లోకి రాకముందు తోబియాస్‌ బ్రిటన్‌ మిలటరీలో పనిచేశారు.

సోదరుడిలా కాకూడదనే..

సోదరుడిలా కాకూడదనే..

2002లో ఇండోనేషియాలోని బాలీలో జరిగిన ఉగ్రపేలుళ్ల ఘటనలో తోబియాస్‌ తన సోదరుడు జోనథాన్‌ను కోల్పోయారు. తన సోదరుడిలా మరొకరు ఉగ్రదాడికి బలవకూడదనే ఉద్దేశంతో ప్రమాదమని తెలిసినా సాహసించి పోలీసును కాపాడేందుకు ప్రయత్నించారు. కాగా, తోబియాస్‌ చేసిన సాహసాన్ని పలువురు అభినందిస్తున్నారు. బ్రిటిష్‌ ఉగ్రదాడి ఘటనలో పోలీస్‌ అధికారి సహా ఐదుగురు మృతిచెందారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Foreign Office Minister Tobias Ellwood, who is a former army officer, is believed to have given mouth-to-mouth resuscitation to a police officer within the grounds of Parliament but later told the BBC that he died at the scene.
Please Wait while comments are loading...