ఉక్కిరిబిక్కిరవుతున్న అమెరికా : బలమైన గాలులు, ఎడతెరిపి లేకుండా మంచు, అంధకారంలో...

టెక్సాస్: బలమైన గాలులు ఒకవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు తుఫాన్ మరోవైపు అమెరికా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆదివారం గంటకు 130 మైళ్ల వేగంతో గాలులు వీచాయని అధికారులు తెలిపారు. దాంతో ఎన్నో చోట్ల పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయన్నారు.

రెండు చోట్ల చెట్లు కూలిపోవడం వల్ల ఇద్దరు మరణించారు. మేరోన్ కంట్రీలోని బ్రూష్ క్రీక్ అపార్ట్‌మెంట్ పక్కన పెద్ద చెట్టు కూలి ఇంటిపై పడిన ఘటనలో ఆ ఇంట్లోని మేరీ పెన్నీ(40) అనే మహిళ మరణించింది. ఈ ప్రమాదంలో ఆమె భర్తకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో వారి ముగ్గురు పిల్లలు ఇంట్లో లేకపోవడంతో వారు తప్పించుకోగలిగారు.

బలమైన గాలులు వీస్తున్న సమయంలో చెట్ల పక్కనగాని, వాటి కిందగాని అస్సలు తలదాచుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. గాలి వేగం పెరగడం వల్ల అవి టోర్నడోలుగా మారే ప్రమాదం ఉన్నట్లు అధికారులు చెప్పారు. కొన్ని చోట్ల గాలి వేగంగా వీయడం వల్ల దుమ్ము, దూళి పెద్ద ఎత్తున లేస్తోంది.

High Winds, Heavy Snow.. Fury on the Northeast America

భారీగా మంచు కురుస్తుడటంతో...

మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల చీకటి పడితే చాలు లక్షా ఇరవై వేల మంది ప్రజలు అంధకారంలో ఉంటున్నారు. ఇప్పట్లో ఆ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగే పరిస్థితులు కనిపించడం లేదని అధికారులు చెప్పారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నీటి సమస్యలు మొదలయ్యాయి. మంచినీళ్లు కూడా దొరకడం లేదని స్థానికులు చెబుతున్నారు. మంచు వల్ల వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో నీళ్లు పైపుల్లో గడ్డ కట్టాయి.

వాహనాలు ఒకదానికొకటి ఢీకొని...

శుక్రవారం సాయంత్రం హైవే నంబరు 94పై తీవ్ర ప్రమాదం జరిగింది. అరవై వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదానికి కారణం రోడ్డుపై పేరుకుపోయిన మంచు అని అధికారులు తేల్చారు. ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+