నా పుస్తకం నచ్చకుంటే: ట్రంప్‌కు హిల్లరీ ఘాటు సమాధానం

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో త‌న ఓట‌మికి కార‌ణాల‌ను వివ‌రిస్తూ హిల్ల‌రీ క్లింట‌న్ 'వాట్ హాపెన్డ్' పేరిట పుస్త‌కం రాసి విడుద‌ల చేశారు. దీని విడుద‌ల‌కు ముందే అమెరికాలోని చాలా బుక్‌షాపుల ముందు జ‌నం క్యూ క‌ట్టారు.

అయితే ఈ పుస్త‌కంపై అధ్యక్ష ఎన్నిక‌ల్లో హిల్ల‌రీకి పోటీగా నిలిచిన ప్ర‌స్తుత అధ్య‌క్షులు డొనాల్డ్ ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. పిచ్చిప‌ట్టిన హిల్ల‌రీ త‌ను ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డానికి కార‌ణాల‌ను మిగ‌తా వాళ్ల‌పై రుద్దుతోందని, కానీ అస‌లు కార‌ణం ఆమేనని ట్రంప్ ట్వీట్ చేశారు.

Hillary Clinton Just Clapped Back at President Trump's Tweet With an Offer

దీనిపై హిల్ల‌రీ గ‌ట్టిగా స్పందించారు. నీకు నా పుస్త‌కం న‌చ్చ‌క‌పోతే, ఈ పుస్త‌కం చ‌దువు, ఇందులో క‌లిసిక‌ట్టుగా ప‌నిచేసి, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే విధానాల గురించి చ‌క్క‌గా వివ‌రించారని మ‌రో పుస్త‌కం 'ఇట్ టేక్స్ ఎ విలేజ్' పుస్త‌కం క‌వ‌ర్ ఫొటోను పోస్ట్ చేసింది. హిల్ల‌రీ ట్వీట్‌ను చాలామంది ప్ర‌శంసించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After President Donald Trump criticized Hillary Clinton for her election loss on Twitter Wednesday, Clinton responded by offering to send him a copy of her children's book, It Takes a Village.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి