భారత్‌ను ముంచెలా ట్రంప్ చర్యలు: చైనా మీడియా సెటైర్లు
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విధానాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని చైనా పేర్కొంది.
బీజింగ్: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విధానాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని చైనా పేర్కొంది. అమెరికాలోని భారత ఐటీ కంపెనీలో స్థానికులకే ఉద్యోగాలంటూ డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న విధానాలు భారత్‌ను ముంచేలా ఉన్నాయని హెచ్చరించింది.
ప్రధానంగా స్థానికులకు ఉద్యోగాలివ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొస్తున్న విధానాలు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మేకిన్ ఇండియా'కు సవాలేనని చైనా మీడియా పేర్కొంది.

అయితే, ఆసియా మిత్ర దేశాలతో అమెరికా సాగిస్తున్న సత్సంబంధాలు భారత్-అమెరికా మైత్రిని బలోపేతం చేస్తాయంటూ చైనా మీడియా ఎద్దేవా చేసింది. ఉగ్రవాదంపై కలిసి పోరాడదామని అమెరికా పిలుపునివ్వడం స్వాగతించదగ్గ విషయమని పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అయినప్పటి నుంచి విదేశీయులపై పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. హెచ్1బీ వీసాలపై కూడా ట్రంప్ పరిమితులు విధించారు. అమెరికా పౌరులకు ఐటీ, ఇతర కంపెనీల్లో ప్రాధాన్యతను ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాన్నారు. దీంతో ఇతర దేశాల నుంచి వచ్చిన పౌరులకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోంది. ఈ క్రమంలో చైనా మీడియా పైవిధంగా కథనాన్ని ప్రచురితం చేసింది.












Click it and Unblock the Notifications