విస్తరిస్తున్న డేంజరస్ వైరస్.. వ్యాక్సిన్ లేదు.. లక్షణాలు ఇవే..
అమెరికాలో హ్యూమన్ మెటాన్యుమోవైరస్ (HMPV) వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ తీర ప్రాంతాల్లో ఈ వైరస్ అతలాకుతలం చేస్తోంది. దాంతో అధికార యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో, శాక్రిమెంటో వంటి నగరాల్లో జనవరి నెలలో ఈ కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కాలిఫోర్నియా, న్యూజెర్సీ సహా కొన్ని రాష్ట్రాల్లో హ్యూమన్ మెటాన్యుమో వైరస్ కేసులు పెరుగుతున్నాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) స్పష్టం చేసింది.
HMPV వల్ల శ్వాసకోశ వ్యాధులు రావచ్చు. దీనికి టీకా లేదా నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స ప్రస్తుతం అందుబాటులో లేవు. వైరస్ సోకినవారికి "సహాయక చికిత్స" (లక్షణాలు తగ్గించేది) అందిస్తారు. చాలామంది సహజంగానే కోలుకుంటారు. అనారోగ్యంగా ఉన్నవారు ద్రవాలు తీసుకుని విశ్రాంతి తీసుకోవాలి. శ్వాస ఇబ్బందులుంటే ఆక్సిజన్ థెరపీ వంటివి అవసరమవుతాయని క్లీవ్ ల్యాండ్ క్లినిక్ సూచించింది.
HMPV 2026లో కొత్త వైరస్ కాదు, 2001లో కనుగొనబడింది. ఏప్రిల్ 2025 వ్యాప్తి తర్వాతే అమెరికాలో కేసులు ఈ స్థాయిలో పెరిగాయి. ఫిబ్రవరి 21 నాటి NREVSS (నేషనల్ రెస్పిరేటరీ అండ్ ఎంటెరిక్ వైరస్ సర్వైలెన్స్ సిస్టమ్) డేటా ప్రకారం, శ్వాసకోశ వైరస్‌ల వారపు పాజిటివ్ పరీక్షల్లో HMPV వాటా 5 శాతం పైగా ఉంది.
ఇది అంతకుముందు వారం 3.83 శాతం నుంచి పెరిగింది. ఏప్రిల్ 2025లో వారపు శాతం 7.43 శాతానికి చేరింది. న్యూజెర్సీలో HMPV, RSV, కోవిడ్, ఫ్లూ కేసులు పెరగడంతో అత్యవసర వైద్య సేవలు కోరే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని న్యూజెర్సీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ నివేదించింది. ఉత్తర కాలిఫోర్నియాలోని మురుగునీటిలో HMPV అధిక సాంద్రతలో గుర్తించబడిందని WastewaterScan డాష్ బోర్డ్ వెల్లడించింది. (ఇది అంటు వ్యాధుల పర్యవేక్షణ డేటాబేస్). CDC ప్రకారం, HMPV లక్షణాలు దగ్గు, ముక్కు కారడం, జ్వరం, శ్వాస ఆడకపోవడం.
కొన్నిసార్లు ఈ లక్షణాలు బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియాకు దారితీయవచ్చు. ఫ్లూ లాగే, HMPV కాలానుగుణమైనది; శీతాకాలం నుండి వసంతకాలం వరకు వ్యాపిస్తుంది. దీని ఇంక్యుబేషన్ కాలం మూడు నుండి ఆరు రోజులు. చిన్నపిల్లలు, 65 ఏళ్లు పైబడిన పెద్దలు అధిక ప్రమాదంలో ఉంటారని CDC తెలిపింది.

HMPVకి నిర్దిష్ట చికిత్స/టీకా లేనప్పటికీ, సంక్రమణను నివారించటానికి చర్యలు తీసుకోవచ్చు. ఇది వ్యక్తుల మధ్య లేదా ఉపరితలాల ద్వారా వ్యాపిస్తుంది. వైరస్‌ల నివారణకు CDC సూచించే ప్రాథమిక వ్యూహాలివి: చేతులను సరిగ్గా కడుక్కోవడం; కడగని చేతులతో కళ్లు, ముక్కు, మెుఖాన్ని తాగకపోవడం.. అనారోగ్యంగా ఉన్నవారికి దూరంగా ఉండటం; తరచుగా తాకే ప్రదేశాలను శుభ్రం చేయడం.. గాలిని పరిశుభ్రంగా ఉంచే చర్యలు. జలుబు లక్షణాలు ఉన్నవారు వ్యాప్తి నివారణకు దగ్గు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కు కప్పుకోవాలి.
-
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్‌తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి..












Click it and Unblock the Notifications