భద్రతామండలిలో చైనా ఒంటరి - పాక్ కు మద్దతివ్వబోయి బోల్తా - భారత్ కు అనూహ్య మద్దతు...
అంతర్జాతీయ వ్యవహారాల్లో పొరుగుదేశం పాకిస్తాన్ కు మద్దతిచ్చే డ్రాగన్ దేశం చైనాకు ఈసారి ఐక్యరాజ్యసమితిలోనూ అదే పని చేయబోయి బొక్క బోర్లా పడింది. ఇన్నాళ్లూ తీవ్రవాదానికి అండగా నిలుస్తున్నా ఒక్క మాట అనకుండా పొరుగు దేశాన్ని వెనకేసుకొచ్చిన చైనా... ఇప్పుడు ఆ దేశంలో తీవ్రవాద దాడిపై ప్రపంచదేశాల మద్దతు కూడగట్టేందుకు విఫలయత్నం చేసింది. కానీ మారిన పరిస్ధితుల్లో చైనాతో అంటకాగుతున్న పాకిస్తాన్ కు మద్దతిచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో భారీ షాక్ తగిలింది.

ఐరాసలో చైనాకు భారీ షాక్..
కరోనా వైరస్ వ్యాప్తి, గల్వాన్ దాడి అనంతరం మారిన పరిస్దితుల్లో అగ్రరాజ్యాల్లో ఒకటిగా చెప్పుకునే చైనాకు అంతర్జాతీయంగా మద్దతు కరవవుతోంది. ఐక్యరాజ్యసమితి సాక్షిగా ఇది మరోసారి బయటపడింది. పాకిస్తాన్ లో తాజాగా స్టాక్ ఎక్చేంజ్‌పై తీవ్రవాదులు దాడి చేశారు. ఇందులో 11 మంది చనిపోయారు. ఈ దాడిని ఖండిస్తూ పాకిస్తాన్ తు ప్రతీ ఒక్కరూ మద్దతివ్వాలని కోరుతూ భద్రతామండలిలో చైనా ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై ప్రపంచ దేశాలు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కానీ ఈ వ్యవహారంలో పాకిస్తాన్ కు మద్దతిచ్చేందుకు మాత్రం ముందుకు రాలేదు.

జర్మనీ అనూహ్యంగా...
పాకిస్తాన్ కు మద్దతుగా చైనా ప్రవేశెపెట్టిన ముసాయిదా తీర్మానానికి మద్దతిచ్చేందుకు మొన్న సాయంత్రం నాలుగు గంటల వరకూ గడువు ఇచ్చారు. చివరి నిమిషం వరకూ దీనిపై స్పందించకుండా మౌనంగా ఉన్న జర్మనీ కాసేపట్లో గడువు ముగుస్తుండగా.. స్పందించింది. కరాచీలో జరిగిన తీవ్ర వాద దాడికి భారతే కారణమంటూ పాక్ విదేశాంగమంత్రి ఖురేషీ చేసిన వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కాదంటూ జర్మనీ దౌత్యవేత్త వ్యాఖ్యానించారు. అదే సమయంలో గడువు ముగిసిందంటూ చైనా దౌత్యవేత్త అడ్డుతగిలినా పట్టించుకోలేదు. చివరికి ఈ గడువును నిన్న ఉదయానికి పొడిగించారు.
Recommended Video

సమయం చూసి అమెరికా..
జర్మనీ స్పందన తర్వాత గడువు పొడిగించగా.. ఈ గడువు ముగుస్తుండగా.. అనూహ్యంగా అమెరికా జోక్యం చేసుకుంది. పాకిస్తాన్ పై చైనా ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై అభ్యంతరాలు తెలిపింది. చివరికి అటు తిరిగి ఇటు తిరిగి తీర్మానం ఆమోదం ఆలస్యమైంది. ఇవాళ తీర్మానం ఆమోదించినప్పటికీ అందులో పాకిస్తాన్ దాడితో పాటు తీవ్రవాదంపై పాకిస్తాన్ వైఖరిని కూడా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఖండించింది. దీంతో చైనాతో పాటు పాకిస్తాన్ కూడా నివ్వెరపోయాయి. అలా పాకిస్తాన్ లో దాడిని భారత్ ఖాతాలో వేసేందుకు చైనాతో కలిసి పొరుగుదేశం వేసిన పన్నాగం విఫలమైంది. అంతే కాకుండా తీవ్రవాదాన్ని పాకిస్తాన్ మద్దతిస్తుందన్న అంశం కూడా తెరపైకి రావడంతో ఆ దేశానికి మద్దతిస్తున్న చైనా కూడా ఇరుకునపడినట్లయింది.












Click it and Unblock the Notifications