మైగాడ్... చైనాలో కొవిడ్ వల్ల మరణించినవారు ఎంతమందో తెలుసా?
చైనా లో కొవిడ్ కేసులు, మరణాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మృతుల సంఖ్యపై డ్రాగన్ దేశం ఎట్టకేలకు నోరు తెరిచింది. గతేడాది డిసెంబరు నుంచి తమ దేశంలో డిసెంబరు 8వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ వరకు దాదాపు 60వేల కొవిడ్ మరణాలు సంభవించినట్లు వెల్లడించింది. ఈ మేరకు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ నివేదిక విడుదల చేసింది. శ్వాసకోశ వ్యవస్థ విఫలమై 5,503 మంది, కొవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య కారణాలతో మరో 54,435 మంది మృతిచెందినట్లు పేర్కొంది. మృతుల సగటు వయసు 80 సంవత్సరాలని, మరణించిన వారిలో 90 శాతం మంది 65 సంవత్సరాలకు పైబడిన వారేనని తెలిపింది.
గతేడాది డిసెంబరులో జీరో కొవిడ్ ఆంక్షలను ప్రజాగ్రహంతో చైనా సడలించక తప్పలేదు. అప్పటి నుంచి దేశంలో రోజురోజుకు కొవిడ్ కేసులు ఎక్కువయ్యాయి. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే జీరో కొవిడ్ ఆంక్షలను సడలించిన తర్వాత కేసుల లెక్కింపును చైనా నిలిపివేసింది. కేవలం శ్వాసకోశ వ్యవస్థ విఫలమై మృతిచెందినవారిని మాత్రమే కొవిడ్ మృతులుగా అధికారింగా లెక్కిస్తున్నట్లు ప్రకటించింది.

చైనాలో రోజురోజుకు కొవిడ్ ఉధృతంగా వ్యాప్తిచెందుతుండటంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. కొవిడ్ కేసులు, మరణాలపై కచ్చితమైన సమాచారన్ని ఇవ్వాలంటూ పలు దేశాలు డిమాండ్ చేశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చైనాకు పలు సూచనలు, సలహాలు ఇచ్చింది. ఆసుపత్రుల్లో చోటుచేసుకున్న మరణాలను మాత్రమే చైనా జాతీయ ఆరోగ్య మిషన్ వెల్లడిస్తోంది. ఇళ్లల్లో సంభవిస్తున్న మరణాలను కూడా లెక్కిస్తే ఇంకా ఎక్కువ మరణాలుంటాయని స్పష్టమవుతున్నట్లు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications